మినపపప్పును చాలా మంది తరచూ వాడుతుంటారు. దీంతో దోశలు, ఇడ్లీలు తయారు చేసి తింటుంటారు. అలాగే తీపి వంటకాలుక కూడా చేస్తుంటారు. కానీ మినపపప్పు అద్భుతమైన లాభాలను అందిస్తుంది కనుక దాంతో తీపి వంటకాలు చేసి తినడం కన్నా ఇతర మార్గంలో తీసుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి. మినపపప్పు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మినపపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, బి విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్, మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. అందువల్ల మనకు అనేక రకాల వ్యాధులు రాకుండా అవి రక్షిస్తాయి.
2. తలనొప్పి సమస్య ఉన్న వారు మినపపప్పు ను తింటుండాలి. ఇందులో ఉండే మెగ్నిషియం, కాల్షియం, పొటాషియం తలనొప్పిని తగ్గిస్తాయి.
3. మినపపప్పును పొట్టుతో సహా తీసుకుంటేనే మేలు జరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మినపపప్పును పొట్టుతో తింటే అందులో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్ ను అంత త్వరగా పెరగనీయదు. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
4. మినపపప్పులో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు మినపపప్పును రోజూ తింటే ఫలితం ఉంటుంది. రక్తం బాగా తయారవుతుంది.
5. మినపపప్పులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది.
మినపపప్పును రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. ముందు రోజు రాత్రి నిద్రకు ముందు 60 గ్రాముల మినపపప్పును తీసుకుని నీటిలో నానబెట్టాలి. తరువాత రోజు ఉదయం మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. అందులో అవసరం అనుకుంటే ఇంకా నీళ్లు కలపవచ్చు. అందులో కొద్దిగా తేనె కలిపి తినవచ్చు.
మినపపప్పును తినడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. శక్తి లభిస్తుంది. నీరసం తగ్గుతుంది.