Too Much Sugar : మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీరు చ‌క్కెర అధికంగా తింటున్నార‌ని అర్థం..!

Too Much Sugar : మ‌న‌లో చాలా మంది పంచ‌దారను, అలాగే పంచ‌దారతో చేసిన వంట‌కాల‌ను ఇష్టంగా తింటారు. పంచ‌దార‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి అధిక మొత్తంలో పంచ‌దార‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. ఈ విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. పంచ‌దార కూడా మనం రోజూ తీసుకునే ఆహారంలో ఒక భాగం. అయితే మ‌నం ఆహారంగా తీసుకునే పంచ‌దార మోతాదుపై త‌గినంత శ్ర‌ద్ద తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. పంచ‌దార‌తో చేసిన తీపి వంట‌కాల‌తో పాటు చాక్లెట్స్, ఐస్ క్రీమ్, కేక్స్ వంటి వాటిని విపరీతంగా తింటూ ఉంటారు.దీంతో మ‌నం తీసుకునే పంచ‌దార మోతాదు పెరుగుతుంది. మ‌నం పంచ‌దారను ఎక్కువ‌గా తీసుకున్న‌ప్పుడు మ‌న శ‌రీరం దానిని పున‌రుద్ఘాటిస్తుంది.

కొన్ని సంకేతాల ద్వారా మ‌నం పంచ‌దారను ఎక్కువ‌గా తీసుకున్న‌ట్టు తెలియ‌జేస్తుంది. పంచ‌దారను ఎక్కువ‌గా తీసుకున్న‌ప్పుడు మ‌న‌లో క‌నిపించే లక్ష‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం త‌రుచూ పంచ‌దారను ఎక్కువ‌గా తీసుకుంటూ అది క్ర‌మంగా ఒక అల‌వాటుగా మారుతుంది. పంచ‌దార తినాల‌నే కోరిక పెరుగుతూ ఉంటుంది. ఇలా అధికంగా పంచ‌దార‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌తో పాటు ర‌క్తపోటు కూడా పెరుగుతుంది. అలాగే పంచ‌దారను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఎక్కువ‌గా ఉండే ఇన్సులిన్ ధ‌మ‌నుల ఆరోగ్యంపై ప్ర‌భావాన్ని చూపిస్తుంది.

these 5 signs indicate that you are taking Too Much Sugar
Too Much Sugar

పంచ‌దార‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ధ‌మ‌నుల గోడ‌లు ఎర్ర‌బ‌డ‌తాయి. అవి మ‌రింత గ‌ట్టిగా త‌యార‌వుతాయి. దీంతో గుండె ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డుతుంది. ఇది క్రమంగా గుండె జ‌బ్బుల‌కు, గుండె వైఫ‌ల్యానికి దారి తీస్తుంది. అదే విధంగా పంచ‌దారను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వల్ల చ‌ర్మ ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. వృద్దాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా ద‌రి చేరుతాయి. కొల్లాజెన్ దెబ్బ‌తిన‌డంతో పాటు చ‌ర్మ ఆరోగ్యం కూడా దెబ్బ‌తింటుంది. అలాగే పంచ‌దారను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డులో డోప‌మైన్ అనే హ్య‌పీ హార్మోన్ ఎక్కువ‌గా విడుద‌ల అవుతుంది. ఇత‌ర ఆహారాల‌ను తీసుకున్న‌ప్పుడు ఈ హార్మోన్ ఎక్కువ‌గా విడుద‌ల అవ్వ‌దు. మ‌నం ఆనందంగా ఉండాలంటే క్ర‌మంగా పంచ‌దారను ఎక్కువ‌గా తీసుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంది.

ఇక పంచ‌దారను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో వెంట‌నే ఆత్రుత‌, భ‌యం వంటివిక‌లుగుతాయి. ఇలా వివిధ ర‌కాల ల‌క్ష‌ణాల ద్వారా మ‌నం పంచ‌దారను ఎక్కువ‌గా తీసుకుంటున్నామ‌ని మ‌నకు మ‌నం శ‌రీరం తెలియ‌జేస్తుంది. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే పంచ‌దారను తీసుకోవ‌డం త‌గ్గించాలి. లేదంటే మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts