Heart Attack : హార్ట్ ఎటాక్ అనేది ప్రస్తుత తరుణంలో సైలెంట్ కిల్లర్‌లా వస్తోంది. ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికి మాత్రమే హార్ట్ ఎటాక్ వచ్చేది. కానీ బాల్యంలో ఉన్నవారికి సైతం హార్ట్ ఎటాక్ వస్తుండడం అందరినీ కలవరపెడుతోంది. అయితే హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ రాత్రి పూట పాటించే కొన్ని అలవాట్లే హార్ఠ్ ఎటాక్‌లకు ముఖ్యంగా కారణం అవుతున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. దీంతోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. ఇక ఏయే కారణాల వల్ల హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి, అవి రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పొగ తాగడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 3 నుంచి 4 రెట్లు పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. స్మోకింగ్ చేయడం వల్ల రక్త నాళాలు పలుచగా మారుతాయి. దీంతో అక్కడ వ్యర్థాలు పేరుకుపోతాయి. దీని వల్ల బీపీ పెరుగుతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. కనుక పొగ తాగడం మంచిది కాదని, దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అంటున్నారు. పొగ తాగడం మానేస్తే హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందని వారు చెబుతున్నారు.
ఇక చాలా మంది ప్రస్తుతం జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, బయటి ఆహారం, చిరు తిళ్లు, మాంసాహారం ఎక్కువగా తింటున్నారు. వీటిల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి హార్ట్ ఎటాక్ వస్తుంది. అందువల్ల ఇలాంటి ఆహారాలకు వీలైనంత వరకు దూరంగా ఉంటే హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు.
శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. అసలు వ్యాయామం చేయడం లేదు. ఇది హైబీపీ వచ్చేందుకు కారణమవుతోంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనుక రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వాకింగ్ చేయాలని అంటున్నారు. కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వాకింగ్ చేసినా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వారు చెబుతున్నారు.
మద్యం విపరీతంగా సేవించడం వల్ల కూడా హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. అలాగే తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. చాలా మందికి నిద్ర సరిగ్గా ఉండడం లేదు. ఇది కూడా హార్ట్ ఎటాక్‌కు కారణమవుతోంది. కనుక ఈ సమస్యల నుంచి బయట పడితే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. లేదంటే ఇది సైలెంట్ కిల్లర్‌లా దాడి చేస్తుంది.ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. కనుక ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.