Weight : అధిక బరువు సమస్య నుంచి బయట పడేందుకు సాధారణంగా చాలా మంది రక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. రోజూ వ్యాయామం చేయడంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకుంటుంటారు. అయితే కొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదని వాపోతుంటారు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటంటే..
1. రోజూ మనకు తగినన్ని గంటల పాటు నిద్ర కూడా అవసరం. నిద్ర సరిగ్గా పోకపోయినా బరువు పెరుగుతారు. కనుక మీర నిద్ర తగినన్ని గంటల పాటు పోతున్నారా, లేదా.. అనే విషయాన్ని గమనించండి. ఈ సమస్యను పరిష్కరించుకుంటే బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
2. రోజూ వ్యాయామం చేస్తున్నాం కదా అని చెప్పి కొందరు జంక్ ఫుడ్, నూనె పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. అలా చేయరాదు. వీటి వల్ల కొవ్వు పెరుగుతుంది. బరువు తగ్గడం కష్టమవుతుంది. కనుక వీటికి బదులుగా నట్స్, విత్తనాలు, పండ్లను తింటే మేలు. బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి.
3. అధిక క్యాలరీలు ఇచ్చే ఆహారాలను కూడా రోజూ చాలా మంది తింటుంటారు. వీటిని కూడా మానేయాల్సి ఉంటుంది. తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. దీంతో బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
4. మనం రోజూ తినే ఆహారాల్లో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఫైబర్ తగినంత లభించకపోతే బరువు తగ్గడం కష్టమవుతుంది. కనుక ఫైబర్ ఉండే ఆహారాలను రోజూ తినాలి. దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు.
5. రోజూ ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోకపోతే బరువు తగ్గరు. కనుక ఈ ఆహారాలను రోజూ తింటుంటే బరువును తగ్గించుకోవచ్చు.
6. రోజూ తగినంత మోతాదులో నీటిని తాగకపోయినా బరువుపై ప్రభావం పడుతుంది. బరువు తగ్గరు. కనుక రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని అయినా తాగాల్సి ఉంటుంది.
7. కొందరు అధికంగా వ్యాయమం చేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. శరీరానికి తగినంత మాత్రమే వ్యాయామం చేయాలి. దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు.
8. చక్కెర, ఇతర తీపి పదార్థాలు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలను రోజూ తింటే బరువు పెరుగుతారే తప్ప తగ్గరు. కనుక వీటిని మానేయాలి. దీంతో బరువు తగ్గడం తేలిక అవుతుంది.