హెల్త్ టిప్స్

Throat Pain : వీటిని తీసుకుంటే చాలు.. ఎలాంటి గొంతు నొప్పి అయినా సరే క్షణాల్లో తగ్గిపోతుంది..!

Throat Pain : ప్రస్తుత తరుణంలో చాలా మందిని గొంతు సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సీజన్‌ మారినప్పుడు.. వాతావరణం తేడాగా ఉన్నప్పుడు సహజంగానే ఎవరికైనా సరే జలుబు చేస్తుంది. దీంతోపాటు గొంతు సమస్యలు కూడా వస్తాయి. గొంతులో మంట, నొప్పి, దురదగా ఉండడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఎవరైనా సరే కింద చెప్పిన చిట్కాలను పాటిస్తే.. దాంతో గొంతు నొప్పి.. ఇతర గొంతు సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక కప్పు నీటిలో అర టీస్పూన్‌ మిరియాల పొడి వేసి మరిగించాలి. కషాయంలా మారిన తరువాత అందులో కాస్త బెల్లం వేయాలి. బెల్లం కరిగాక గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని తాగాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం పోతుంది. దగ్గు తగ్గుతుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

throat pain home remedies take these for better relief

రెండు కప్పుల నీళ్లలో ఒక టీస్పూన్‌ వాము వేసి మరిగించాలి. నీరు ఒక కప్పు అయ్యే వరకు మరిగించాక అనంతరం మిశ్రమాన్ని వడకట్టాలి. అందులో కాస్త నిమ్మరసం, తేనె కలపాలి. ఇలా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజుకు రెండు సార్లు తాగాలి. దీని వల్ల గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి.

గొంతు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఒక టీస్పూన్‌ తులసి రసం, రెండు టీస్పూన్ల తేనె కలిపి మిశ్రమంగా చేసి రోజుకు 4 సార్లు తీసుకోవాలి. దీంతో నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజూ ఉదయం, రాత్రి భోజనానికి 30 నిమిషాల ముందు 30 ఎంఎల్‌ మోతాదులో ఉసిరికాయ రసాన్ని సేవించాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా గొంతు నొప్పి నుంచి బయట పడవచ్చు. ఇలా పలు చిట్కాలను పాటిస్తే గొంతు నొప్పి సత్వరమే తగ్గిపోతుంది. శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Admin

Recent Posts