Triphala Churna : మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో వాత, కఫ, పిత దోషాలు ఎక్కువవడం చేత అనేక అనారోగ్య సమస్యలను మనల్ని పట్టి పీడుస్తున్నాయి. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎంతో ఖర్చు చేయాల్సి వస్తుంది. శరీరంలో ఎక్కువైన ఈ వాత, పిత, కఫ దోషాల నుండి నుండి బయటపడాలన్నా లేని వారికి రాకుండా ఉండాలన్నా త్రిఫలా చూర్ణాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో త్రిఫలా చూర్ణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాత, కఫ, పిత దోషాలను తగ్గించడంలో ఇది అద్భుతంగా పని చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ త్రిఫలా చూర్ణాన్ని ఉసిరికాయ, కరక్కాయ, తానికాయలతో తయారు చేస్తారు.
ఈ చూర్ణం మనకు మెడికల్ షాపుల్లో, ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో విరివిరిగా లభిస్తుంది. ఈ త్రిఫలా చూర్ణాన్ని రోజూ తీసుకోవడం వల్ల మనకు వైద్యుని అవసరం ఉండదనే చెప్పవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ త్రిఫలా చూర్ణాన్ని ఎలా తీసుకోవాలి..ఎంత మోతాదులో తీసుకోవాలి..ఎప్పుడు తీసుకోవాలి.. అలాగే దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. త్రిఫలా చూర్ణాన్ని రోజూ అర టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీని కోసం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఈ చూర్ణాన్ని వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి ఈ నీటిని భోజనానికి గంట నుండి అరగంట ముందు తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల మనం సమస్త రోగాలను దూరం చేసుకోవచ్చు. త్రిఫలా చూర్ణాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే గ్యాస్, మలబద్దకం, అజీర్తి, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం వంటి జీర్ణసమస్యలన్నీ తగ్గుతాయి. శరీరంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరం శుభ్రపడుతుంది. కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు, షుగర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. అలాగే ఈ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల దగ్గు, కఫం, ఊపిరితిత్తుల్లో శ్లేష్మం పేరుకుపోవడం వంటి సమస్యలన్నీ తగ్గుతాయి.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు తొలగిపోతుంది. ఎముకలను ధృడంగా చేయడంలో, నొప్పులను తగ్గించడంలో కూడాత్రిఫలా చూర్ణం మనకు సహాయపడుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా చేయడంలో కూడా ఈ చూర్ణం మనకు దోహదపడుతుంది. ఈ చూర్ణాన్ని తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా త్రిఫలా చూర్ణం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని ప్రతి ఒక్కరు దీనిని తీసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు.