Tulsi Ginger Water : రోజూ ప‌ర‌గ‌డుపునే తుల‌సి అల్లం నీళ్ల‌ను తాగితే.. చెప్పలేన‌న్ని మార్పులు జ‌రుగుతాయి..!

Tulsi Ginger Water : మ‌నం ఆరోగ్యంగా జీవించేందుకు గాను మ‌న జీవ‌న‌విధానంలో ప‌లు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఆరోగ్య‌క‌క‌ర‌మైన జీవ‌న విధానం కోసం మ‌నం ఉద‌యం చేసే ప‌నులు చాలా ముఖ్య‌మైన‌విగా చెప్పుకోవ‌చ్చు. చాలా మంది ఉద‌యం లేవ‌గానే త‌మ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. అయితే ఇందుకు బ‌దులుగా మీరు ఆరోగ్య‌క‌ర‌మైన డ్రింక్స్‌ను తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. ఇలాంటి డ్రింక్స్‌ను ఉద‌యాన్నే తాగ‌డం వ‌ల్ల మీరు అనేక తీవ్ర‌మైన వ్యాధుల నుంచి ర‌క్షింప‌బ‌డ‌తారు. అయితే అలాంటి ఆరోగ్య‌క‌మైన డ్రింక్స్‌లో తుల‌సి, అల్లం నీళ్లు కూడా ఒక‌టి. ఉద‌యాన్నే నీటిలో తుల‌సి ఆకులు, అల్లం వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను తాగుతుంటే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ ఉద‌యాన్నే తుల‌సి అల్లం నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల జీర్ణక్రియ మెరుగు ప‌డుతుంది. ప‌ర‌గ‌డుపునే ఈ నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. దీంతో అధిక బ‌రువు సుల‌భంగా త‌గ్గుతారు. అలాగే ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. తుల‌సి, అల్లం నీళ్ల‌లో యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అలాగే ఈ నీళ్ల‌లో యాంటీ వైర‌ల్‌, యాంటీ కొలెస్ట్రాల్ ల‌క్ష‌ణాలు కూడా ఉంటాయి. అందువ‌ల్ల ఈ నీళ్ల‌ను తాగితే రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డ‌డ‌మే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నీళ్ల‌ను ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగితే బ‌రువును త‌గ్గించుకోవ‌డం చాలా తేలిక‌వుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం క‌రిగిపోతుంది.

Tulsi Ginger Water drink daily on empty stomach for these benefits
Tulsi Ginger Water

తుల‌సి ఆకుల్లో యూజినాల్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. అల్లంలో ఉండే జింజ‌రాల్ అనే స‌మ్మేళ‌నం జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రిచి కొవ్వును క‌రిగిస్తుంది. మీరు త‌ర‌చూ ద‌గ్గు, జ‌లుబు వంటి సీజ‌న‌ల్ వ్యాధుల బారిన ప‌డుతుంటే మీకు తుల‌సి, అల్లం నీళ్లు చ‌క్క‌ని ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. ఈ నీళ్ల‌ను రోజూ తాగుతుంటే సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ నీళ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే బాడీ డిటాక్స్ అవుతుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కుపోయి శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. అలాగే ఉద‌యం ఈ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల నోరు శుభ్ర‌ప‌డుతుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. ఇలా తుల‌సి, అల్లం నీళ్ల‌తో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి వీటిని రోజూ ఖాళీ క‌డుపుతో తాగ‌డం మ‌రిచిపోకండి.

Editor

Recent Posts