Turmeric Water : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ప‌సుపు నీళ్ల‌ను తాగండి.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే షాక‌వుతారు..!

Turmeric Water : భార‌తీయుల వంట‌గ‌దుల‌ల్లో ఉండే వాటిల్లో ప‌సుప కూడా ఒక‌టి. ఇది దాదాపు అంద‌రి ఇండ్ల‌ల్లో ఉంటుంది. ఎంతోకాలంగా మ‌నం ప‌సుపును వంట్ల‌లో విరివిగా ఉప‌యోగిస్తున్నాము. ప‌స‌పులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని మ‌నంద‌రికి తెలిసిందే. వంట‌ల్లో వాడ‌డంతో పాటుగా పాల‌ల్లో కూడా ప‌సుపును క‌లిపి తీసుకుంటూ ఉంటాము. వీటితో పాటుగా ప‌సుపును నీటిలో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ గోరువెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ ప‌సుపును క‌లిపి రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మరిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ప‌సుపును నీటిలో క‌లిని ప‌ర‌గడుపున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌సుపులో క‌ర్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క‌ణాల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించి అలాగే ఫ్రీరాడిక‌ల్స్ ను న‌శింప‌జేసి మ‌న‌ల్ని దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. రోజూ ఉద‌యం ప‌సుప నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ త‌గ్గుతుంది. ఆర్థ‌రైటిస్, కీళ్ల నొప్పులు, వాపులు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. రోజూ ప‌సుపు నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ప‌సుపు యాంటీ మైక్రోబ‌యాల్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. ప‌సుపు నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వైర‌స్లు, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ప‌సుపు నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వులు సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి.

Turmeric Water drink daily in the morning for many benefits
Turmeric Water

అంతేకాకుండా గ్యాస్, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్యలు కూడా త‌గ్గుతాయి. రోజూ ప‌సుపునీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో డిటాక్సిఫికేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతుంది. శ‌రీరంలో ఉండే మ‌లినాలు, విష ప‌దార్థాల తొల‌గిపోతాయి. ప‌సుప నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. అదే విధంగా రోజూ ప‌ర‌గ‌డుపున ప‌సుపు నీటిని తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. రక్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఇన్సులిన్ సెన్సెటివీ పెరుగుతుంది. ఇక ప‌సుపు నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. ప‌సుపు నీటిని తీస‌కోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీర మెరుగుప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తితో మెద‌డు ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ప‌సుపు నీరు స‌హ‌జ‌సిద్ద‌మైన పెయిన్ కిల్ల‌ర్ గా కూడా ప‌ని చేస్తుంది. ప‌సుపు నీటిని తాగ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు త‌గ్గుతాయి. స్త్రీల‌ల్లో వ‌చ్చే నెల‌స‌రి నొప్పి కూడా త‌గ్గుతుంది. ఈ విధంగా రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ప‌సుపు నీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ప‌సుపు నీటిని తీసుకోవ‌డం అంద‌రూ వారి దిన‌చ‌ర్య‌లో భాగం చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts