Ulavalu Benefits : ఉల‌వ‌చారును తాగితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Ulavalu Benefits : ఉల‌వ‌లు.. వీటి గురించి మ‌న‌లో చాలా మందికే తెలిసి ఉంటుంది. పూర్వకాలంలో వీటిని ఎక్కువ‌గా ఆహారంగా తీసుకునేవారు. ఉల‌వ‌ల‌తో కారం పొడి, ఉల‌వ‌ల చారు, గుగ్గిళ్లు వంటివి త‌యారు చేసి తీసుకునేవారు. అలాగే వీటిని ఎక్కువ‌గా గుర్రాల‌కు ఆహారంగా ఇస్తూ ఉంటారు. కాలం మారుతున్న కొద్ది వీటి వాడ‌కం కూడా త‌గ్గుతూ వ‌చ్చింది. కానీ ఉలవ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి. క‌నుక వీటిని త‌గిన మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఉల‌వ‌ల‌తో చేసిన చారును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు తెలియ‌జేస్తున్నారు.

ఉల‌వ‌చారును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో వాతాన్ని త‌గ్గించ‌డంలో ఉల‌వ‌లు అద్భుతంగా ప‌ని చేస్తాయి. ఉల‌వ‌చారును తీసుకోవ‌డం వ‌ల్ల వాతం వ‌ల్ల క‌లిగే నొప్పులు త‌గ్గుతాయి. అలాగే ఉల‌వ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు స‌మ‌స్య నుండి కూడా చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం బ‌లంగా, ధృడంగా త‌యార‌వుతుంది. నీర‌సం, నిస్స‌త్తువ వంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. రోజంతా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే వారు ఉల‌వ చారును తీసుకోవ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఉల‌వ‌ల నుండి తీసిన పాల‌ను బాలింత‌ల‌కు ఇవ్వ‌డం వల్ల వారిలో పాల శాతం పెరుగుతుంది. ఉల‌వ‌ల‌ను ఉడికించి మెత్త‌గా రుబ్బాలి.

Ulavalu Benefits in telugu know about them
Ulavalu Benefits

త‌రువాత ఈ మిశ్రమాన్ని గుడ్డ‌లో వేసి పిండ‌గా వ‌చ్చిన పాల‌ల్లో పంచ‌దార వేసి బాలింత‌ల‌కు ఇవ్వాలి. ఉల‌వ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రేచీక‌టి స‌మ‌స్య దూర‌మ‌వుతుంది. ఉల‌వచారును వేడి వేడిగా తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, క‌ఫం వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. గ‌ర్భాశ‌య దోషాల‌ను దూరం చేసే గుణం కూడా ఉల‌వ‌ల‌కు ఉంది. ఉల‌వచారును తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో వ‌చ్చే నెల‌స‌రి స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు తెల్ల‌బ‌ట్ట స‌మ‌స్య కూడా త‌గ్గుతుంది. ఉల‌వ‌చారును తీసుకోవ‌డం వ‌ల్ల విరోచ‌నాలు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య క్ర‌మంగా త‌గ్గుతుంది. ఈ విధంగా ఉల‌వ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts