టైప్‌ 2 డయాబెటిస్‌ను అదుపు చేసే దాల్చిన చెక్క..!

దాల్చిన చెక్క మన అందరి ఇళ్లలోనూ వంట ఇంటి మసాలా దినుసుల డబ్బాల్లో ఉంటుంది. దీన్ని మసాలా వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వాటిల్లో టైప్‌ 2 డయాబెటిస్‌ కూడా ఒకటి. ఈ వ్యాధి ఉన్నవారికి దాల్చిన చెక్క ఎంతగానో మేలు చేస్తుంది.

use cinnamon for type 2 diabetes

దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. టైప్‌ 2 డయాబెటిస్‌ వచ్చేందుకు ఇది కూడా ఒక కారణం. అందువల్ల దాల్చినచెక్క ఈ సమస్యను తగ్గిస్తుంది. దీంతో డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా గ్రహిస్తుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

టైప్‌ 2 డయాబెటిస్‌ ఇన్సులిన్‌ నిరోధకత వల్ల వస్తుంది. కానీ దాల్చిన చెక్క ఈ సమస్యను తగ్గిస్తుంది. అందువల్ల షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి. అలాగే లివర్‌ పనితీరు కూడా మెరుగు పడుతుంది. హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. క్లోమగ్రంథిలో బీటా కణాలు ఉత్తేజమై తిరిగి పనిచేస్తాయి. దీంతో టైప్‌ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ విషయాలను సైంటిస్టులు ప్రయోగాత్మకంగా పరిశీలించి వివరాలను వెల్లడించారు కూడా. కనుక దాల్చిన చెక్కను నిత్యం వాడడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ ను అదుపులో ఉంచుకోవచ్చు.

ఇక దాల్చిన చెక్క పొడిని నిత్యం ఉదయం సాయంత్రం పావు టీస్పూన్‌ మోతాదులో తీసుకోవచ్చు. లేదా రెండు కప్పుల నీటిలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసి నీటిని బాగా మరిగించాలి. నీరు బాగా మరిగాక అందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమం వేడిగా ఉండగానే తాగేయాలి. ఇలా రోజుకు రెండు పూటలా చేస్తే ఫలితం ఉంటుంది.

Share
Admin

Recent Posts