యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. వాటిల్లో సర్పాసనం కూడా ఒకటి. దీన్ని ఎలా వేయాలి ? ఏమేం లాభాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బోర్లా పడుకుని రెండు కాళ్లూ దగ్గరగా ఉంచి పాదాలను వెనక్కు చాపాలి. తలను చిత్రంలో చూపిస్తున్నట్లుగా కాస్త పైకి ఉంచి, చేతులను వెనక్కు తీసుకుని వెళ్లి, ఒక చేతి వేళ్లు మరో చేతి వేళ్లలోకి వెళ్లేలా కలిపి ఉంచాలి. ఈ స్థితిలో చేతులను శరీరానికి ఆన్చకుండా పైకి పెట్టాలి. రెండు చేతులను మరింతగా వెనక్కు సాగదీస్తూ.. ఛాతి భాగాన్ని శ్వాస తీసుకుంటూ పైకి ఎత్తాలి. అలా ఎంత వరకు పైకి లేవగలుగుతారో.. అంతగా లేవాలి. వెనుక భుజాలు దగ్గరగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ముందుకు చూడాలి. ఆసనంలో ఉన్నప్పుడు సాధారణ శ్వాసలో ఉండాలి. అలా ఎంత సమయం ఉండగలరో ఉండి తరువాత శ్వాస వదులుతూ శరీరాన్ని నేలకు ఆన్చుతూ రిలాక్స్ అవ్వాలి. ఇలా రోజుకు 2 నుంచి 5 సార్లు చేయవచ్చు.
* సర్పాసనం వేయడం వల్ల శరీరాకృతి అందంగా మారుతుంది.
* భుజాల నొప్పులు తగ్గుతాయి.
* శ్వాస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* పొట్ట కండరాలు గట్టి పడతాయి.
* స్త్రీలలో రుతుక్రమం సరిగ్గా అవుతుంది. ఆ సమయంలో సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి.
* జీర్ణశక్తి పెరుగుతుంది.
* లివర్, మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారికి మేలు కలుగుతుంది.
* నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. నిద్ర బాగా వస్తుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365