Vegetable Juice For Fat : రోజూ దీన్ని తాగండి చాలు.. ఒంట్లో ఉన్న కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది..!

Vegetable Juice For Fat : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ఊబ‌కాయం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మ‌నం ఉండ‌వ‌ల్సిన బ‌రువు కంటే 10 కేజీలు దాటి అంత‌కంటే ఎక్కువ బ‌రువు ఉంటే దానిని ఊబ‌కాయం అంటారు. అదే ఉంవ‌ల్సిన బ‌రువు కంటే 25 కిలోలు దాటి బ‌రువు పెరిగితే దానిని భారీ ఊబ‌కాయం (మార్బిడ్ ఒబెసిటీ ) అని పిలుస్తారు. ఊబ‌కాయం కార‌ణంగా అనేక ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. షుగ‌ర్, బీపీ, గుండె జ‌బ్బులు, కీళ్ల నొప్పులు వంటి అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఊబ‌కాయం కార‌ణంగా త‌లెత్తుతాయి. శ‌రీర బ‌రువు త‌గ్గితే త‌ప్ప జ‌బ్బుల‌న్నీ త‌గ్గ‌వు. చాలా మంది బ‌రువు త‌గ్గ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు.

త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌డానికి మార్కెట్ లో దొరికే అనేక ర‌కాల మందుల‌ను, పొడుల‌ను, లేహ్య‌ల‌ను వాడుతూ ఉంటారు. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డం సంగ‌తి ప‌క్క‌కు పెడితే అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. బ‌రువు త‌గ్గిన‌ప్ప‌టికి శ‌రీరానికి ఎటువంటి హాని క‌ల‌గ‌కుండా ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గాల‌ని నిపుణులు చెబుతున్నారు. కింద చెప్పే విధంగా ఒక చ‌క్క‌టి డైట్ ప్లాన్ ను మ‌నం పాటించ‌డం వ‌ల్ల చాలా సులభంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ డైట్ ప‌ద్ద‌తిని పాటించ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా త‌లెత్త‌కుండా ఉంటాయి. అలాగే మ‌నం చాలా త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు రోజుకు రెండు సార్లు తిన‌డం ఆరోగ్యానికి మంచిది. ఉద‌యం పూట 9 .30 గంట‌ల నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా నీటిని తాగుతూ ఉండాలి.

Vegetable Juice For Fat take daily for many other benefits
Vegetable Juice For Fat

ఉద‌యం పూట ప‌నుల‌ను, వ్యాయామాల‌ను కూడా ఖాళీ క‌డుపుతోనే చేయాలి. 10 గంట‌ల‌కు ఒక గ్లాస్ వెజిటెబుల్ జ్యూస్ ను తాగాలి. జ్యూస్ తాగిన గంట త‌రువాత 3 ర‌కాల మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకోవాలి. వీటిని 4 లేదా 5 ఖ‌ర్జూర పండ్ల‌తో తీసుకోవాలి. అలాగే 2 అంజీరాల‌ను కూడా తీసుకోవ‌చ్చు. వీటితో పాటు న‌చ్చిన పండ్ల‌ను క‌డుపు నిండా తీసుకోవాలి. ఈ విధంగా ఉద‌యం పూట ఆహారాన్ని తీసుకోవాలి. ఇక మ‌ధ్యాహ్నం ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా నీటిని మాత్ర‌మే తీసుకోవాలి. త‌రువాత సాయంత్రం 4 గంట‌ల‌కు ఏదో ఒక ఫ్యూట్ జ్యూస్ ను తాగాలి. త‌రువాత 5 నుండి 6 గంట‌ల మ‌ధ్య‌లో స్వీట్ కార్న్ గింజ‌ల‌ను లేదా సలాడ్ ను తీసుకోవాలి.

త‌రువాత నాన‌బెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. సాయంత్రం 6 గంట‌ల త‌రువాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు. ఈ విధంగా రోజుకు రెండు పూట‌లా మాత్ర‌మే ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు వేగంగా క‌రుగుతుంది. అలాగే శ‌రీరంలో ర‌క్తం పెరుగుతుంది. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌ల‌న్నీ చ‌క్క‌గా తొల‌గిపోతాయి. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయి. ఈ విధంగా చ‌క్క‌టి ఆహారాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts