Vitamin B5 Foods For Depression : డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న ఉన్నాయా.. ఈ 5 ఆహారాల‌ను రోజూ తినండి..!

Vitamin B5 Foods For Depression : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ బి5 కూడా ఒక‌టి. దీనినే పాంతోతేనిర‌క్ యాసిడ్ అంటారు. ఇత‌ర పోష‌కాల వ‌లె విట‌మిన్ బి5 కూడా మ‌న శ‌రీరానికి చాలా అవ‌స‌రం. విట‌మిన్ బి 5 కూడా మ‌న శ‌రీరంలో వివిధ విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. శ‌రీరంలో ఈ విట‌మిన్ లోపిస్తే మ‌నం వివిధ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. విట‌మిన్ బి5 లోపం వ‌ల్ల డిప్రెష‌న్, అల‌స‌ట‌, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు ఎదురవుతాయి. అలాగే వాంతులు, క‌డుపులో నొప్పి, పాదాల‌ల్లో మంట‌లు, వివిధ ర‌కాల శ్వాస‌కోశ ఇన్ఫెక్షన్ ల‌తో బాధ‌పడాల్సి వ‌స్తుంది. క‌నుక మ‌న శ‌రీరంలో త‌గినంత విట‌మిన్ బి5 ఉండేలా చూసుకోవాలి. విట‌మిన్ బి5 లోపాన్ని ప్రారంభ ద‌శ‌లోనే గుర్తించి త‌గిన చికిత్స తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. లేదంటే మ‌నం మరింత తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది.

విట‌మిన్ బి 5 లోపం త‌గ్గాల‌న్నా అలాగే ఈ స‌మ‌స్య త‌లెత్త‌కుండా ఉండాలన్నా మ‌నం విట‌మిన్ బి5 ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. విట‌మిన్ బి 5 ఎక్కువ‌గా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విట‌మిన్ బి5 ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో అవ‌కాడో కూడా ఒక‌టి. దీనిలో విట‌మిన్ బి5తో పాటు విట‌మిన్ బి6, మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. రోజూ 2 మిల్లీ గ్రాముల అవ‌కాడోను తింటే చాలు రోజువారి అవ‌స‌రాల్లో 20 శాతం విటమిన్ బి5 ను పొంద‌వ‌చ్చు. ఇక చికెన్ లివ‌ర్ లో కూడా విట‌మిన్ బి5 ఉంటుంది. రోజూ 8.3 మిల్లీ గ్రాముల చికెన్ లివ‌ర్ ను తింటే మ‌న రోజువారి అవ‌స‌రాల‌లో 83 శాతం విట‌మిన్ బి5 ల‌భిస్తుంది. అయితేదీనిని సాధ్య‌మైనంత త‌క్కువ నూనెతో వండుకుని తిన‌డానికి ప్ర‌య‌త్నించాలి.

Vitamin B5 Foods For Depression take daily for stress
Vitamin B5 Foods For Depression

అదే విధంగా రోజూ 2 గుడ్ల‌ను తిన‌డానికి ప్ర‌య‌త్నించాలి. గుడ్ల‌ల్లో ప్రోటీన్, బీట్ కెరోటీన్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌తో పాటు విట‌మిన్ బి5 కూడా ఉంటుంది. అలాగే స్మాల‌న్ చేప‌ల‌ల్లో కూడా విట‌మిన్ బి5 ఉంటుంది. రోజూ 1.6 మిల్లీ గ్రాముల సాల్మ‌న్ చేప‌ల‌ను తింటే మ‌న రోజూవారి అవ‌స‌రాలల్లో 16 శాతం విట‌మిన్ బి5 ని పొంద‌వ‌చ్చు. అలాగే పొద్దుతిరుగుడు గింజ‌ల‌ల్లో కూడా విట‌మిన్ బి5 ఎక్కువ‌గా ఉంటుంది. రోజూ 6 మిల్లీ గ్రాముల పొద్దుతిరుగుడు గింజ‌లను తింటే చాలు మ‌న రోజువారి అవ‌స‌రాల‌ల్లో 60శాతం విట‌మిన్ బి5 ను పొంద‌వ‌చ్చు. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ బి5 తో పాటు ఇత‌ర అనేక పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts