Vitamin D Deficiency : మీకు కూడా ఇలాగే రోజూ అవుతుందా.. అయితే జాగ్ర‌త్త‌..!

Vitamin D Deficiency : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. రోజూ ఎండ‌లో నిల‌బ‌డ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరం విట‌మిన్ డి ని త‌యారు చేసుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా కాలేయంలో జ‌రుగుతుంది. ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, మాన‌సిక శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరం క్యాల్షియంను గ్ర‌హించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా విట‌మిన్ డి మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. అయితే నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది విట‌మిన్ డి లోపంతో బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి వారిలో విట‌మిన్ డి లోపం ఉంద‌ని కూడా తెలియ‌దు. దీంతో విట‌మిన్ డి లోపం మ‌రింత ఎక్కువ అయ్యి తీవ్ర అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు. శ‌రీరంలో విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల మ‌న‌లో కొన్ని ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

ఈ ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మ‌న శ‌రీరంలో విట‌మిన్ డి లోపించింద‌ని మ‌నం తెలుసుకోవ‌చ్చు. శ‌రీరంలో విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల త‌ల తిరిగిన‌ట్టుగా ఉంటుంది. అలాగే శ‌రీరంలో క్యాల్షియం లోపం కూడా మొద‌ల‌వుతుంది. కండ‌రాల నొప్పులు, న‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, భుజం నొప్పి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. అలాగే విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం క్షీణిస్తుంది. త‌రుచూ డిప్రెష‌న్, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే ఆక‌లి లేక‌పోవ‌డం, చెమ‌ట‌లు ప‌ట్ట‌డం, వాంతి అయిన‌ట్టుగా ఉండడం వంటి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. అంతేకాకుండా విట‌మిన్ డి లోపించ‌డం వ‌ల్ల జుట్టు ఎక్కువ‌గా ఊడిపోతుంది. నిద్రలేమి స‌మ‌స్య మొద‌లువుతుంది. చ‌ర్మం పొడిబారుతుంది.

Vitamin D Deficiency know what happens to your body
Vitamin D Deficiency

చ‌ర్మం నిర్జీవంగా త‌యార‌వుతుంది. ఇటువంటి ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి మ‌న శ‌రీరంలో విట‌మిన్ డి లోపించింద‌ని తెలుసుకోవాలి. ఈ స‌మ‌స్య తలెత్తిన వెంట‌నే త‌గిన చికిత్స తీసుకోవాలి. అలాగే విటమిన్ డి క్యాప్సుల్స్ ను లేదా విటమిన్ డి ఎక్కువ‌గాఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. రోజూ శ‌రీరానికి ఎండ త‌గిలేలా చూసుకోవాలి. ముఖ్యంగా విట‌మిన్ డి ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వల్ల ఈ స‌మ‌స్య‌నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. చేప‌లు, కోడిగుడ్డు, సోయా పాలు, ఓట్ మీల్, పాలు వంటి ఆహారాల్లో విట‌మిన్ డి ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం శ‌రీరంలో విట‌మిన్ డి లోపం త‌లెత్త‌కుండా చూసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts