Vitamin E Foods For Skin : చర్మం అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందమైన చర్మం కోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మార్కెట్ లో ఉండే బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వల్ల చర్మం బాహ్యంగా మాత్రమే అందంగా కనిపిస్తుంది. అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల కలిగే అందం ఎక్కువ కాలం పాటు ఉండదు. చర్మ అందానికి, ఆరోగ్యానికి బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడడంతో పాటు విటమిన్ ఇ ఉండే ఆహారాలను తీసుకోవాలి. చర్మ ఆరోగ్యంలో, అందంలో విటమిన్ ఇ ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. సహజంగానే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.
చర్మంగా అందంగా కనబడాలనుకునే వారు రోజూ విటమిన్ ఇ ఉండే పదార్థాలను రోజు వారి ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల చర్మం అంతర్గతంగా అలాగే బాహ్యంగా కూడా అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. చర్మ అందాన్ని మెరుగుపరిచే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారాల్లో బచ్చలికూర కూడా ఒకటి. బచ్చలికూరలో విటమిన్ ఇ తో పాటు విటమిన్ ఎ, సి, కె, ఐరన్,ఫోలేట్, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల బచ్చలికూరలో 2.03 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. బచ్చలికూరను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. చర్మ సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. అలాగే అవకాడోలో కూడా విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుఉంది.
100 గ్రాముల అవకాడోలో 2.07 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. అవకాడోను తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. అలాగే చర్మంపై ముడతలు తొలగిపోతాయి.వృద్దాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు బాదంపప్పును కూడా ఆహారంగా తీసుకోవాలి. 100 గ్రాముల బాదంపప్పులో 25.63 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. బాదంపప్పును తీసుకోవడం వల్ల దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మానికి ఎటువంటి నష్టం కలగకుండా కాపాడడంతో దోహదపడతాయి. అదే విధంగా బ్రోకలీలో కూడా విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు వండిన బ్రోకలీలో 2.3 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది.
బ్రోకలీని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అలాగే పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. 100 గ్రాముల పొద్దు తిరుగుడు గింజల్లో 35.17మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఇక విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో పల్లీలు కూడా ఒకటి. 100 గ్రాముల పల్లీల్లో 4.93 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మానికి హాని కలగకుండా కాపాడడంలో ఇవి మనకు సహాయపడతాయి. ఈ విధంగా విటమిన్ ఇ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మన చర్మాన్ని సహజంగా అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.