Waist Fat Drink : రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు.. పొట్ట, న‌డుము చుట్టూ ఉండే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..

Waist Fat Drink : మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తుంది. మ‌న‌ల్ని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య కార‌ణంగా తలెత్తే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాగే పొట్ట‌, పిరుదులు, తొడ‌లు వంటి శ‌రీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. కొంద‌రు బ‌రువు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికి ఆయా భాగాల్లో కొవ్వు పేరుకుపోయి చూడ‌డానికి వికారంగా క‌న‌బ‌డ‌తారు. బ‌రువు త‌గ్గ‌డానికి చాలా మంది ర‌క‌ర‌కాల డైటింగ్ లు చేస్తూ ఉంటారు. ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. దీంతో శ‌రీరానికి త‌గిన‌న్ని పోషకాలు అంద‌క ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంది. అలాగే బ‌రువు త‌గ్గ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్న వారిని కూడా మ‌నం చూస్తూ ఉన్నాం.

ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా త‌క్కువ శ్ర‌మ‌తో మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. కేవ‌లం మూడు ర‌కాల ప‌దార్థాల‌తో ఒక పానీయాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ ప‌దార్థాల‌న్నీ మ‌న‌కు సుల‌భంగా అందుబాటులో ఉండేవే. అధిక బ‌రువును త‌గ్గించే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడ‌య్యాక అందులో అర చెక్క నిమ్మ‌కాయ‌ను తీసుకుని ముక్క‌లుగా చేసి వేయాలి.

Waist Fat Drink take daily for better results
Waist Fat Drink

త‌రువాత అందులో రెండు ఇంచుల అల్లం ముక్క‌ను శుభ్ర‌ప‌రిచి ముక్క‌లుగా చేసి వేయాలి. ఈ నీటిని 5 నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి. త‌రువాత ఇందులో 25 నుండి 30 పుదీనా ఆకుల‌ను వేసి నీటిని బాగా మ‌రిగించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గిన్నె మీద మూత‌ను ఉంచి నీరు గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. రుచి కొర‌కు దీనిలో ఒక టీ స్పూన్ తేనెను వేసి క‌లుపుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల పొట్ట , పిరుదులు, తొడలు వంటి భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి స‌న్న‌గా, నాజుకుగా త‌యార‌వుతారు.

ఈ పానీయాన్ని త‌యారు చేయ‌డంలో ఉప‌యోగించిన ప‌దార్థాల‌న్నీ స‌హ‌జ సిద్ద‌మైన‌వే. వీటిలో మ‌న శ‌రీరంలో ఉండే కొవ్వును క‌రిగించే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పానీయాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఆక‌లి త‌క్కువ‌గా అవుతుంది. త‌ద్వారా మ‌నం త‌క్కువ ఆహారాన్ని తీసుకోవ‌డం జ‌రుగుతుంది. దీంతో మ‌నం బ‌రువు త‌గ్గుతాము. ఈ విధంగా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ పానీయాన్ని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఫ‌లితాల‌ను పొందుతారు.

D

Recent Posts