Indian Style Red Sauce Pasta : పాస్తాను ఇలా చేసుకుని తినొచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..

Indian Style Red Sauce Pasta : పాస్తా.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. ఒక‌ప్పుడు దీనిని ఇత‌ర దేశస్థులు మాత్ర‌మే ఆహారంగా తీసుకునే వారు. కానీ ప్ర‌స్తుత కాలంలో ఇది మ‌న ఆహారంలో భాగమైపోయింది. పాస్తాతో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. పాస్తాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. పాస్తాతో చేసుకోద‌గిన వంట‌కాల్లో రెడ్ సాస్ పాస్తా కూడా ఒక‌టి. ఈ రెడ్ సాస్ పాస్తాను ఇండియ‌న్ స్టైల్ లో రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియ‌న్ స్టైల్ రెడ్ సాస్ పాస్తా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గోధుమ పిండితో త‌యారు చేసిన పాస్తా – 200 గ్రా., నూనె – 5 టీ స్పూన్స్, అల్లం మ‌రియు వెల్లుల్లి త‌రుగు – ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉడికించిన ప‌చ్చి బ‌ఠాణీ – 3 టీ స్పూన్స్, ఉడికించిన స్వీట్ కార్న్ – 3 టీ స్పూన్స్, కారం – ఒక టీ స్పూన్, ట‌మాట ఫ్యూరీ – ఒక క‌ప్పు, చీజ్ క్యూబ్స్ – అర క‌ప్పు, ట‌మాట సాస్ – ఒక టీ స్పూన్.

Indian Style Red Sauce Pasta recipe in telugu very easy dish
Indian Style Red Sauce Pasta

ఇండియ‌న్ స్టైల్ రెడ్ సాస్ పాస్తా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ముప్పావు లీట‌ర్ ను తీసుకుని వేడి చేయాలి. ఇందులోనే ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నీటిని మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత పాస్తాను వేసి 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత నీటిని వ‌డ‌క‌ట్టి పాస్తాను రెండు లేదా మూడు సార్లు నీటితో క‌డిగి ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అల్లం వెల్లుల్లి ముక్క‌లను వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు వేసి క‌లపాలి. త‌రువాత ఉడికించిన బ‌ఠాణీ, స్వీట్ కార్న్ గింజ‌ల‌ను వేసివేయించాలి.

ఇవి వేగిన త‌రువాత కారం వేసి క‌లపాలి. త‌రువాత ట‌మాట ఫ్యూరీని వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత చీజ్ క్యూబ్స్, ట‌మాట సాస్ వేసి ఒక నిమిషం పాటు క‌లుపుతూ వేయించాలి. తరువాత ఉడికించిన పాస్తాను వేసి అంతా క‌లిసేలా బాగా కలిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇండియ‌న్ స్టైల్ రెడ్ సాస్ పాస్తా త‌యార‌వుతుంది. దీనిని ఉద‌యం అల్పాహరంగా లేదా సాయంత్నం స్నాక్స్ గా చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని పిల్లలు మ‌రింత ఇష్టంగా తింటారు.

D

Recent Posts