Wallet In Pant Back Pocket : సాధారణంగా చాలా మంది పురుషులు ప్యాంటు వెనుక జేబులో పర్సును ఉంచుకుంటూ ఉంటారు. పర్సులో డబ్బులు, కార్డులు వంటి వాటిని పెట్టుకుంటారు. ఇది సాధారణంగా అందరూ చేసేదే. అయితే మీరు కూడా ఇలాగే చేస్తే మీరు కూడా ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ అనే సమస్య బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవును మీరు విన్నది చదివింది నిజమే.
ప్యాంట్ వెనుక జేబులో పర్సును ఉంచుకోవడం వల్ల చాలా మంది యువత ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ అనే సమస్య బారిన పడుతన్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఈరోజుల్లో మరింత ఎక్కువగా పెరిగిందని వారు చెబుతున్నారు. ప్యాంటు వెనుక జేబులో పర్సును ఉంచుకుని నడవడం వల్ల, మెట్లు ఎక్కడం వల్ల, తుంటిపై తీవ్ర ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
దీంతో తుంటి యొక్క సమతుల్యత దెబ్బతినడంతో పాటు తుంటి నొప్పి, తుంటికి తిమ్మిర్లు రావడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది తీవ్ర రూపం దాల్చి సయాటికా వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక ప్యాంట్ వెనుక జేబులో పర్సు పెట్టుకునే అలవాటు ఉన్న వారు ఇప్పటికైనా ఈ అలవాటును మానుకోవాలని లేదంటే భవిష్యత్తులో తుంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.