Dabbakaya Pokkimpu : ఈ వంట‌కం తెలుసా.. ఇడ్లీ, రోటీ, రైస్‌.. ఎందులోకి అయినా స‌రే బాగుంటుంది..!

Dabbakaya Pokkimpu : ద‌బ్బ‌కాయ‌.. ఇది మ‌నంద‌రికి మ‌నంద‌రికి తెలిసిందే. నిమ్మ‌జాతికి చెందిన ద‌బ్బ‌కాయ‌ల‌ను కూడా మ‌నం వంటల్లో భాగంగా వాడుతూ ఉంటాము. ద‌బ్బ‌కాయ‌లో కూడా పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. నిమ్మ‌కాయ‌ల‌తో చేసుకున్నట్టే ద‌బ్బ‌కాయ‌ల‌తో కూడా ప‌చ్చ‌డిని చేసుకోవ‌చ్చు. దీనిని ద‌బ్బ‌కాయ‌ల పొక్కింపు అని అంటారు. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. పుల్ల పుల్ల‌గా, కారంగా, తియ్య‌గా ఉండే ఈ ద‌బ్బ‌కాయ పొక్కింపును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. అంద‌రూ ఇష్ట‌ప‌డే ఈ ద‌బ్బ‌కాయ పొక్కింపును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ద‌బ్బ‌కాయ పొక్కింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ద‌బ్బ‌కాయ – 1, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, బెల్లం – పావు క‌ప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్.

Dabbakaya Pokkimpu recipe in telugu make in this method
Dabbakaya Pokkimpu

తాళింపుకు కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె- 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 1, ఇంగువ – పావు టీ స్పూన్.

ద‌బ్బ‌కాయ పొక్కింపు త‌యారీ విధానం..

ముందుగా ద‌బ్బ‌కాయ లోప‌ల ఉండే గింజ‌ల‌ను తీసేసి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వాటిని గిన్నెలోకి తీసుకుని మూత పెట్టి చిన్న మంట‌పై 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఇందులో ఉప్పు, బెల్లం, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. ముక్క‌లు ఉడుకుతుండ‌గానే క‌ళాయిలో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగాచేసుకోవాలి. ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత అందులో మిక్సీ ప‌ట్టుకున్న ఆవాల పొడి, కారం వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి.

ఇప్పుడు తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఇంగువ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. తాళింపు చ‌ల్లారిన త‌రువాత ముక్క‌ల‌పై వేసి క‌ల‌పాలి. దీనిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. రెండు రోజుల పాటు బాగా ఊరిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ద‌బ్బ‌కాయ పొక్కింపు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో పాటు అల్పాహారాల‌తో కూడా తినవ‌చ్చు.

D

Recent Posts