Watermelon Seeds Powder : నేటి తరుణంలో మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో బీపీ కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. బీపీ ని సైలెంట్ కిల్లర్ గా వైద్యులు అభివర్ణిస్తూ ఉంటారు. ఈ బీపీ చాప కింద నీరులా శరీరాన్నంటిని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మన ఆహారపు అలవాట్లు, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ రకాల కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. బీపీ బారిన పడిన వారు జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి నెలకొంది. బీఈపీ సమస్యను తగ్గించుకోవడానికి వేసుకునే మాత్ర చిన్నగా ఉన్నప్పటికి దీనిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల మనం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బీపీ మాత్రలను ఎక్కువ కాలం పాటు వాడడం వల్ల మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, దంతాలకు సంబంధించిన సమస్యలు, మతిమరుపు, అల్జీమర్స్, కాళ్లు, చేతులు తిమ్మిర్లు, అరికాళ్లల్లో, అరి చేతుల్లో సూదులతో గుచ్చినట్టు ఉండడం వంటి ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార నియమాలను పాటించడం వల్ల ఎటువంటి మందులను వాడకుండానే మనం బీపీని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బీపీ సమస్యతో బాధపడే వారు ప్రతిరోజూ ఒక గంట పాటు ఏదో ఒక వ్యాయామం చేయాలి. అలాగే ఆహారంలో భాగంగా పుచ్చకాయ విత్తనాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ విత్తనాలను కళాయిలో దోరగా వేసి వేయించాలి. తరువాత వీటికి సమానంగా గసగసాలను తీసుకోవాలి.
ఈ రెండింటిని జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని గాజు సీసాలో వేసి గాలి తగలకుండా నిల్వ చేసుకోవాలి. బీపీ టాబ్లెట్ ను రోజుకు రెండు సార్లు వేసుకునే వారు ఈ పొడిని రెండు సార్లు ఉపయోగించాలి. ఒకసారి వేసుకునే వారు ఈ పొడిని ఒకసారి ఉపయోగించాలి. అర టీ స్పూన్ మోతాదులో వేడి నీటితో ఈ పొడిని తీసుకోవాలి. ఇలా గసగసాలు, పుచ్చగింజలతో చేసిన పొడిని తీసుకోవడం వల్ల మందులు వాడే అవసరం లేకుండా బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొడిలో మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు మందులు వాడే అవసరం లేకుండా బీపీని అదుపులో ఉంచుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పొడిని తీసుకుంటూనే నీటిని ఎక్కువగా తాగాలి. రోజులో ఏదో ఒక సమయంలో అరటి పండును తినాలి.
అదే విధంగా వెల్లుల్లిని, ఆకుకూరలను ప్రతిరోజూ ఆహారంగా తీసుకోవాలి. వీటితో పాటు బార్లీ నీళ్లను, కాకర కాయ జ్యూస్ ను కూడా తీసుకోవాలి. ఈ విధంగా పుచ్చగింజలు, గసగసాలు కలిపిన పొడిని తీసుకుంటూ, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మందులు వాడే అవసం లేకుండా బీపీ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే రక్తనాళాల్లో అడ్డంకులు ఉండి, గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు అలాగే వయసు ఎక్కువగా ఉన్న వారు మాత్రం తప్పకుండా బీపీ ట్యాబ్లెట్ ను తప్పకుండా వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.