Jowar Kichdi : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన జొన్న కిచిడి.. ఇలా చేయాలి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Jowar Kichdi : మ‌నం చిరు ధాన్యాలైన‌టు వంటి జొన్న‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. జొన్న‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని నిపుణులు అనేక ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలియ‌జేసారు. జొన్న‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ జొన్న‌ల‌తో మ‌నం రొట్టె, అన్నం, సంగ‌టి వంటి వాటినే కాకుండా ఎంతో రుచిగా ఉండే కిచిడిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కిచిడిని తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. జొన్న‌ల‌తో ఎంతో రుచిగా ఉండే కిచిడినీ ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

జొన్న కిచిడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఆరు గంట‌ల పాటు నాన‌బెట్టిన జొన్న ర‌వ్వ – ఒక క‌ప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – 1, బిర్యానీ ఆకు – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 1, అల్లం త‌రుగు – ఒక టీ స్పూన్, ప‌చ్చి బ‌ఠాణీ – అర క‌ప్పు, చిన్న ముక్క‌లుగా త‌రిగిన క్యారెట్ – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, 4 గంట‌ల పాటు నాన‌బెట్టిన పెస‌ర్లు – పావు క‌ప్పు, నీళ్లు – 3 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Jowar Kichdi recipe in telugu healthy and tasty
Jowar Kichdi

జొన్న కిచిడి త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం త‌రుగు వేసి వేయించాలి. త‌రువాత బ‌ఠాణీ, క్యారెట్ వేసి క‌లిపి మూత పెట్టాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన త‌రువాత మూత తీసి ప‌సుపు, పెస‌ర్లు వేసి క‌ల‌పాలి. మ‌ర‌లా మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత నీళ్లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నాన‌బెట్టుకున్న జొన్న ర‌వ్వ వేసి క‌ల‌పాలి.

దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించాలి. అవ‌స‌ర‌మైతే మ‌రికొన్ని నీళ్లు పోసుకుని ర‌వ్వ‌ను మెత్త‌గా ఉడికించుకోవాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే జొన్న కిచిడి త‌యార‌వుతుంది. దీనిని పెరుగు రైతాతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా జొన్న ర‌వ్వ‌తో కిచిడిని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు. ఈ కిచిడినీ అల్పాహారంగా, మ‌ధ్యాహ్నం లేదా రాత్రి భోజ‌నంగా ఎలా అయినా తిన‌వ‌చ్చు.

D

Recent Posts