మనిషికి ఊపిరితిత్తులు చాలా ముఖ్యం. మనిషి శరీరంలో ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. వాటి పట్ల అలసత్వం ఏ మాత్రం వహించిన మూల్యం చెల్లించుకోకతప్పదు. వేటినైతే నిర్లక్ష్యం చేస్తున్నామో.. అవే ప్రాణాలకు హానీ చేకూరుస్తాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధి లక్షణాలను ముందే ఎలా పసిగట్టవచ్చంటే ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు భరించలేని ఛాతి నొప్పి, ప్రత్యేకించి ఊపిరి పీల్చినప్పుడు దగ్గు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే చాలా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దీర్ఘకాలిక కఫం అనేది అంటువ్యాధుల కారణంగా వస్తుంది. ఇది ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం వస్తున్నట్లయితే.. ఊపిరితిత్తులు వ్యాధి బారిన పడినట్లే అని తెలుసుకోవాలి. మీ శరీర బరువు ఆటోమెటిక్‌గా తగ్గుతున్నట్టైతే అనారోగ్యానికి గురవుతున్నట్లే అని గుర్తించాలి. ఇది శరీరం పంపుతున్న సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు వచ్చే ఈల లాంటి శబ్దం ఊపిరితిత్తులు దెబ్బతిన్న ప్రారంభ సంకేతాలలో ఒకటి. ఇరుకైన వాయుమార్గాలు ఈ ధ్వనిని కలిగిస్తాయి. ఎందుకంటే ఇవి ఊపిరితిత్తులలోకి గాలిని ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి మరింత కష్టతరం చేస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి తలెత్తితే ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించుకోవాలి.
మీరు శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదుర్కొన్నా, వెంటనే వెంటనే ఊపిరి పీల్చుకున్నా.. అది ఊపిరితిత్తులు వ్యాధి బారినపడిట్లు గుర్తించాలి. ఊపిరితిత్తులలో కణితి, కార్సినోమా నుంచి ద్రవం ఏర్పడటం వలన గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. మీరు ఎప్పుడైనా గాలి కోసం ఊపిరి పీల్చుకున్నట్లు లేదా మీరు లోతైన శ్వాస తీసుకోలేనట్లు అనిపిస్తే… మీ ఊపిరితిత్తులు ఇబ్బంది పడుతున్నట్టు. ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న కండరాలు క్షీణించడంతో లోతుగా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. మీకు ఎనిమిది వారాలు, అంతకంటే ఎక్కువ కాలం పాటు రక్త చారలతో కూడిన దగ్గు వస్తున్నట్లయితే.. దీర్ఘకాలిక వ్యాధిగా పరిగణించబడుతుంది. శ్వాసకోస వ్యవస్థలో ఏదో తేడా జరుగుతుందని వెంటనే గమనించాలి.