Weight Loss : ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా అనేక ఇబ్బందులు పడి, అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడి బరువు తగ్గాలని అనుకునే వారు కూడా ఉంటారు. ఇలా బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసి నెలలో 5 నుండి 10 కిలోల బరువు తగ్గేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా వేగంగా బరువు తగ్గడం మన ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న సందేహం కూడా మనలో చాలా మందికి వస్తుంది. వేగంగా బరువు తగ్గడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి.. బరువు తగ్గడం ఆరోగ్యం మీద ఎటువంటి ఫ్రభావాన్ని చూపిస్తుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు మార్కెట్ లో బరువు తగ్గించే రకరకాల టీలు, పొడులు లభ్యమవుతూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి నశించి మనం త్వరగా తగ్గుతాము.
ఇలా బరువు తగ్గడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. బరువు తగ్గే టీ లను, పొడులను వాడడం వల్ల శరీరంలోకి ఎటువంటి పోషకాలు, మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అందవు. శరీరానికి ఎటువంటి పోషకాలు అందకపోవడంతో పాటు వ్యాయామం చేయకపోయిన మనం బరువు తగ్గుతాము. ఇలా బరువు తగ్గడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం, రక్తంలో మార్ను రావడం వంటి అనేక దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుంది. దీని వల్ల శరీరానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. కొంతమంది వ్యాయామాలు చేస్తూ , ఆహార నియమాలు పాటిస్తూ వేగంగా బరువు తగ్గిన ఎటువంటి నష్టం ఉండదు. బరువు తగ్గడానికి చాలా మంది జ్యూస్ ఫాస్టింగ్ వంటి వాటిని చేస్తూ ఉంటారు. ఇలా జ్యూస్ పాస్టింగ్ చేయడం వల్ల కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ తప్ప శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు లభిస్తాయి.
ఇలా బరువు తగ్గడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. శరీరంలో కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇలా చేయడం వల్ల దుష్ప్రభావాల బారిన పడకుండా బరువు తగ్గుతారు. అలాగే కొందరూ ఫ్రూట్స్ డైటింగ్ కూడా చేస్తూ ఉంటారు. మూడు పూటలా ఫ్రూట్స్ ను తిని బరువు తగ్గుతారు. ఇలా చేయడం వల్ల కూడా మన శరీరానికి ఎటువంటి హాని కలగదు. అలాగే మరికొందరు రోజుకు రెండు పూటలా కేవలం రా ఫుడ్ ను తీసుకుంటూ బరువు తగ్గుతారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాల బారిన కూడా పడకుండా ఉంటాము. ఆహార నియమాలు పాటించకుండా, వ్యాయామాలు చేయకుండా బరువు తగ్గే పద్దతులన్నీ దుష్ప్రభావాలను కలిగిస్తాయి.
ఈ పద్దతులను పాటించడం వల్ల వేగంగా బరువు తగ్గినప్పటికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్లె మనం ఎక్కువగా బరువు పెరుగుతాము. కనుక చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేస్తూ బరువు తగ్గడం అనేది చాలా శ్రేష్టమైన పద్దతి. శరీరానికి పోషకాహారాన్ని అందిస్తూ బరువు తగ్గడం అనేది చాలా మంది పద్దతని దీని వల్ల కూడా మనం చాలా త్వరగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.