హెల్త్ టిప్స్

ముఖానికి ఆవిరి ప‌డితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

జలుబు చేసినప్పుడు ఎవరైనా వెంటనే ఇచ్చే సలహా ఆవిరి పట్టండి కొంచెం ఉపశమనం కలుగుతుంది అని చెబుతాం.జులుబు చేసినపుడు మాత్రమే ఆవిరి పట్టడం అనేది మనకి తెలిసింది.కానీ ఆవిరి పట్టడం అంటే కేవలం జలుబు చేసినప్పుడు ముక్కుకారడం నుంచి రిలీఫ్ కోసం అని మాత్రమే కాదు.ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయనే విషయం చాలా వరకు ఎవరికి తెలియదు.

ఆవిరి పట్టడం వల్ల ముఖ సౌందర్యం మెరుగు పడుతుంది.మనం రోజూ ముఖానికి రాసుకునే క్రీములు, లోషన్లు, వాటిలో ఉండే రసాయనాలు వలన చర్మానికి అందాల్సిన పోషకాలు అందకపోడం మాత్రమే కాక ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి.దీని వల్ల చర్మం కాంతి కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.అలా నిర్జీవంగా ఉన్న ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖం పై మూసుకుపోయిన రంధ్రాలు తెరచుకొని మురికి బయటకు వచ్చేస్తుంది.దీంతో ముఖం శుభ్రం అయ్యి కాంతివంతం గా కనిపిస్తుంది.

what happens if you apply steam to face

ఈ విధంగా నెలకి రెండు సార్లు చేస్తే చాలా మంచిది.ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కంటి కింద నల్లటి వలయాలు తో బాధ పడుతున్నారు.తరచూ ముఖానికి ఆవిరి పట్టడం వల్ల నెమ్మదిగా నల్లటి వలయాలు తగ్గు ముఖం పడతాయి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ముఖ సౌందర్యం మెరుగు పడుతుంది.

Admin

Recent Posts