హెల్త్ టిప్స్

Aloe Vera Juice : క‌ల‌బంద ర‌సాన్ని రోజూ తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

Aloe Vera Juice : మనలో చాలా మంది ఇళ్లలో అలోవెరా మొక్కను ఎక్కువగా పెంచుతారు. ఈ మొక్కనే మన వాడుక భాషలో కలబంద అని పిలుస్తాము. ఎక్కువ నీరు పొయ్యకపోయినా బతికే ఎడారి మొక్క ఇది. కానీ దానిలో ఉన్న ఔషధగుణాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలోవెరా మొక్క కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కలబందలో ఉండే గుజ్జు 96 శాతం నీటితోనే తయారవుతుంది. శతాబ్దాలుగా అలోవెరాను సంప్రదాయ ఔషధ మొక్కగా వాడుతున్నారు.

కలబంద రసంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కలబంద రసం హైడ్రేటింగ్‌గా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి. అంతేకాకుండా కలబంద మొక్కలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో జింక్, కాల్షియం, పొటాషియం, సోడియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఈ పోషకాలన్నీ మీ శరీరానికి అందించి వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతుంది. చర్మంపై అలర్జీలను దూరం చేస్తుంది. కలబంద రసాన్ని రోజూ తాగడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు కీళ్ల నొప్పులు వంటి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కలబంద రసం ప్రేగులలో నీటి శాతాన్ని పెంచడంలో బాగా సహాయపడుతుంది. తద్వారా మలబద్ధక సమస్య నివారిస్తుంది.

what happens if you drink Aloe Vera Juice daily

కలబంద రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని దరిచేరనివ్వదు. కలబంద పూర్తిగా సహజమైనది కాబట్టి ఇది మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే కలబంద తినడం అనేది అందరికీ పని చేయకపోవచ్చు. మీరు కలబందను జ్యూస్ రూపంలో గాని లేక తినే ముందు ఒకసారి నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Admin

Recent Posts