త్వరగా బరువు తగ్గాలనుకునేవారికి తెల్ల చిక్కుడు గింజల రసం చాలా బాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్లను అరికడుతుంది. శరీరంలో ఒక ఎంజైముతో కలసి అనవసరమైన గ్లూకోజుగా మారకుండా చేస్తుంది.
తెల్ల చిక్కుడు గింజల లాభాలను ఆరోగ్యపరంగా పరిశీలిస్తే… వీటి రసం శరీరంలోని ట్రిగ్లీసెరైడ్స్ ను తగ్గించేందుకు సహకరిస్తుంది. కీళ్ళ అరుగుదలను నివారిస్తుంది. కార్బోహైడ్రేట్లను నిలుపు చేసి శరీరం లావు ఎక్క కుండాను, రక్తనాళాలు గడ్డకట్టకుండాను చేస్తుంది.
శరీరంలో కొవ్వును బాగా లాగేస్తుంది. వీటివలన ఏర్పడే కొన్ని సమస్యలు పరిశీలిస్తే, కార్బో హైడ్రేట్లను విచ్ఛిన్నం కాకుండా చేస్తుంది కనుక జీర్ణవ్యవస్ధపై ప్రభావం చూపి గ్యాస్ సమస్యలు ఏర్పరుస్తాయి. గుండెమంట, డయేరియా కూడా కలిగించే గుణాలున్నాయి. కనుక ఈ గింజలను మోతాదులో తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలను తింటే బరువు తగ్గుతారని, జీర్ణ సమస్యలు ఉండవని చెబుతున్నారు.