హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌లిపి తిన‌కూడ‌దు తెలుసా..?

కొన్ని ఆహార పదార్ధాలు కలిపి తింటే జీర్ణ వ్యవస్ధకు ప్రమాదకరమవుతుంది. పాలు తాగి పుల్లటి పదార్ధాలు తినవద్దని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. కొన్ని పదార్దాలు ఒకదానితో మరి ఒకటి కలిపితే ఏర్పడే ఆరోగ్యపర నష్టం సహజమైంది. పాలతో పాటుగా నిమ్మరసం తాగితే కడుపులోయాసిడ్ తయారై అది విష పదార్ధంగా తయారవుతుంది. కనుక వాటి గురించి కొన్ని వివరాలు తెలుసుకోండి. మింట్ – కూల్ డ్రింకులు: ఈ రెండూ కలుపరాదు. ఇవి రెండూ కలిసి పొట్టలో సరైన పాళ్ళలో పడితే అది సైనేడ్ అనే విషపదార్ధంగా తయారవుతుంది.

పాలు- నిమ్మజాతి పండు లేదా కూరలు: పాలు త్వరగా జీర్ణం కావు. ఇక వాటిలో ఒక నిమ్మకాయ పిండితే, అది గడ్డకట్టి ఎసిడిటీ ఏర్పడుతుంది. ఫలితంగా గుండెమంట, గ్యాస్ వస్తాయి. పండ్లు – పిండి పదార్ధాలు: అన్నం తిన్న వెంటనే పండు తీసుకుంటే జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది. పొట్టలో గ్యాస్ ఏర్పడే ప్రమాదం వుంది.

do not mix these foods and take

ప్రొటీన్లు – పిండిపదార్ధాలు: పొటాటో చిప్స్, వేపుడు చికెన్ కలిపి తినరాదు. ఈ రెండిటికి జీర్ణక్రియ వేరుగా వుంటుంది. ప్రొటీన్లు పొట్టలో జీర్ణం అయితే, చికెన్ పేగులలో జీర్ణం అవుతుంది. షుగర్ – ప్రొటీన్స్: చికెన్ తిన్న తర్వాత పండ్ల జ్యూసులు తాగితే సమస్య వస్తుంది. తిన్న పదార్ధాలు అరగటానికి చాలా సమయం పడుతుంది. ప్రొటీన్ల ఆహారం తిన్న రెండు గంటల తర్వాత స్వీట్లు తినండి. విషపూరితంగా తయారయ్యే ఈ ఆహార పదార్ధాల కలగలుపులను మానండి. ఆరోగ్య చిట్కాలు పాటించండి.

Admin

Recent Posts