Energy : మన శరీరంలో తగినంత శక్తి ఉంటేనే మనం ఏ పనినైనా చురుకుగా, ఉత్సామంగా చేయగలుగుతాము. బలం, ధృడంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామ. మనలో శక్తి ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చురుకుగా పని చేసుకోవాలంటే మన శరీరానికి మూడు రకాల పదార్థాలను ఖచ్చితంగా అందించాలి. ఈ మూడు రకాల పదార్థాలు శక్తిని పెంచడానికి అతి ముఖ్యంగా పని చేస్తాయి. శరీరానికి తగినంత శక్తిని అందించే వాటిలో మొదటిది మనసు. మనసేంటి.. మన శరీరానికి శక్తిని అందించడమేంటి అని మనలో చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒత్తిడిగా ఉన్నా, ఆందోళనగా ఉన్నా, చికాకుగా ఉన్నా కూడా శరీరంలో శక్తి తగ్గుతుంది. మనసే ముఖ్యంగా మన శరీరానికి బలాన్ని ఇస్తుంది.
డిపెష్రన్ గా, ఇరిటేటింగ్ ఉన్నప్పుడు కొన్ని రకాల స్ట్రెస్ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి రక్తనాళాల, శ్వాస నాళాలు ముడుచుకుపోయేలా చేస్తాయి. దీంతో రక్తసరఫరాలో, ఆక్సిజన్ సరఫరాలో మార్పులు వస్తాయి. దీని వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది. మనసు బాలేనప్పుడు మనకు నీరసంగా, ఓపిక లేనట్టుగా అనిపిస్తుంది. కనుక శరీరంలో శక్తి తగ్గకుండా ఉండాలంటే మనసును ఎప్పుడూ ఉత్సాహంగా ఉంచుకోవాలి.నెగెటివ్ ఆలోచనలను మానేసి ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఆలోచించాలి. మనల్ని మనమే ఉత్సాహపరుచుకుంటూ ఉండాలి.
ఇక శక్తిని ఎక్కువగా అందించే రెండవది నిద్ర. రోజూ 7 నుండి 8 గంటల పాటు నిద్రించడం వల్ల కండరాలు, అవయవాలకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. ఇలా విశ్రాంతి లభించే సమయంలోనే శరీరం తనని తాను శుభ్రపరుచుకుంటుంది. దీంతో మనం మరుసటి రోజూ ఉత్పాహంగా పని చేసుకోగలుగుతాము. ఎక్కువ సేపు నిద్రించడం వల్ల కండరాలు ఉత్తేజంగా ఉంటాయి. 8 గంటల పాటు చక్కటి విశ్రాంతి తీసుకోవడం వల్ల మనం ఎంత ఎక్కువగా పని చేసినప్పటికి అలసట రాకుండా ఉంటుంది. తక్కువగా నిద్రించిటప్పుడు చాలా అలసటగా ఉండడాన్ని మనలో చాలా మంది గమనించే ఉంటారు. కనుక మనం ఉత్సాహంగా, చురుకుగా పని చేసుకోవాలన్నా మనం 8 గంటల పాటు నిద్రించడం చాలా అవసరం.
ఇక శరీరానికి తగినంత శక్తి కావాలంటే ఎక్కువగా బలాన్ని ఇచ్చే ఆహారాలను తీసుకోవాలి. పల్లీలు, పచ్చి కొబ్బరి, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు పప్పు, పుచ్చగింజల పప్పు, బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా పప్పు, వాల్ నట్స్ వంటి వాటిని రోజూ తీసకోవాలి. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం నీరసం, నిస్సత్తువ బారిన పడకుండా ఉంటాము. ఈ విధంగా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ, తగినంత నిద్రపోవడంతో పాటు, చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం ఉత్సాహంగా పని చేసుకోగలుగుతామని నిపుణులు చెబుతున్నారు.