మధుమేహం వ్యాధి ఉన్న వారు ఏమీ తినలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. తియ్యని పండ్లు తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉంటారు. కానీ, నిజానికి మధుమేహగ్రస్తులను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆరోగ్యకరమైన పండ్లు కూడా ఉన్నాయి. అటువంటి పండ్లు ఒకసారి చూద్దాం.
ముఖ్యంగా మనకు దొరికే అన్ని రకాల బెర్రీ పండ్లు రాస్ప్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీలు మధుమేహ గ్రస్తుల్లో షుగర్‌ను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ప్రతి రోజూ యాపిల్ తినడం వల్ల వైద్యుల అవసరం ఉండదంటారు. ఆపిల్స్‌లో పెక్టిన్ అధికంగా ఉంటుంది. రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను పెంచుతుంది. కాబట్టి తాజాగా ఉండే యాపిల్స్, లేదా జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ షుగర్‌ను తగ్గిస్తుంది.
మధుమేహగ్రస్తులు తినగలిగే పండ్లలో నల్లద్రాక్ష ఒకటి. వీటిలో కెలోరీస్ తక్కువ ఉండటమే కాకుండా, వీటి గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. కానీ ఆకుపచ్చ ద్రాక్షలను తినకూడదు. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ. ఇవి షుగర్‌ను పెంచుతాయి. కనుక నల్లద్రాక్ష పండ్లను మాత్రమే తినాలి. ఇంకా రేగు పండ్లు ఉండే ఫైబర్ మధుమేహగ్రస్తులకు, హార్ట్ పేషంట్స్ కు చాలా మేలు చేస్తుంది. కనుక వీటిని కూడా వారు తినవచ్చు.