Curd : రోజూ మధ్యాహ్నం భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా..?

Curd : మ‌నం పెరుగును కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. పెరుగు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పెరుగుతో తిన‌నిదే కొంద‌రికి భోజ‌నం చేసిన‌ట్టుగా కూడా ఉండ‌దు. అయితే చాలా మంది పెరుగును డిస‌ర్ట్ గా, స్నాక్స్ గా తీసుకుంటూ ఉంటారు. కానీ పెరుగును భోజ‌నంతో తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. భోజ‌నంతో పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. అయితే రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత మాత్రం పెరుగును తీసుకోకూడ‌ద‌ని వారు చెబుతున్నారు. రాత్రి భోజ‌నం చేసిన పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపులో గ్యాస్, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు.

మ‌ధ్యాహ్నం భోజ‌నంతో పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగును తీసుకోవ‌డం వల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. కారిస్టాల్ మ‌రియు స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్ప‌త్తిని త‌గ్గించి బ‌రువు పెర‌గ‌కుండా అదుపు చేయ‌డంలో పెరుగు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తుంది. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. త‌రుచూ ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ముఖ్యంగా స్త్రీలు పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల యోని ఇన్పెక్ష‌న్ లు రాకుండా ఉంటాయి. పెరుగులో ఉండే ల‌క్టోబాసిల్ల‌స్ బ్యాక్టీరియా యోని ఇన్పెక్ష‌న్ లు రాకుండా అరిక‌ట్ట‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అంతేకాకుండా పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య అదుపులో ఉంటుంది.

why it is important to take curd in lunch
Curd

అలాగే భోజ‌నంతో పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. పెరుగును తీసుకోవ‌డం వ‌ల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. పొట్ట సంబంధిత స‌మ‌స్యలు ఎక్కువ‌గా రాకుండా ఉంటాయి. ఈ విధంగా పెరుగు మ‌న ఆరోగ్యానికి అనేక ర‌కాలుగా మేలు చేస్తుంద‌ని దీనిని ప్ర‌తి ఒక్క‌రు త‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పెరుగును ఒక్కొక్క‌రు ఒక్కో స‌మ‌యంలో తీసుకుంటూ ఉంటారు. వారి ఇష్టానికి త‌గిన‌ట్టు వారికి న‌చ్చిన స‌మ‌యంలో పెరుగును తీసుకుంటూ ఉంటారు. ఏ స‌మ‌యంలో తీసుకున్న‌ప్ప‌టికి పెరుగు మ‌న ఆరోగ్యానికి మేలు చేస్తుంద‌ని అయితే భోజ‌నంతో తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు.

Share
D

Recent Posts