సాధారణంగా మహిళలు తాము తీసుకునే ఆహారం పట్ల శ్రధ్ధ వహించరు. ఇక ఉద్యోగస్తులైతే, అశ్రధ్ధ మరింత ఎక్కువే. సమయం వుండదంటూ అందుబాటులో వున్నది ఏదో ఒక సమయంలో తినేస్తుంటారు. ఇక సాయంత్రమయే సరికి నీరసపడటమే. ఇట్టి మహిళలు చక్కని పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్యంగాను, ఫిట్ గాను, రోజంతా అలసట లేకుండాను వుండాలంటే ఏం చేయాలనేది చూద్దాం. మహిళలు, ప్రతి దినం తీసుకునే రెగ్యులర్ ఆహారంతోపాటు, అదనంగా కొన్ని పోషక విలువలు కల ఆహారం తీసుకుంటే, మలబద్ధకం, అజీర్ణం, ఎలర్జీలు, తలనొప్పులు రుతు సమస్యలు లాంటివి దరకి చేరవు. కాంతులీనే చర్మం, ఆరోగ్యగరమైన జుట్టు, శరీరం వారి సొంతమవుతుంది.
ఉద్యోగ మహిళలకు పోషకవిలువలుకల ఆహార ప్రణాళిక: 1. బ్రేక్ ఫాస్ట్: దీనిలో తేలికగా జీర్ణమై, త్వరగా శక్తినిచ్చే పండ్లు వుండాలి. బ్రెయిన్ సెల్స్ కు తక్షణమే గ్లూకోజ్ అంది యాక్టివ్ గా వుంచుతుంది. పుచ్చకాయ, ద్రాక్ష, ఆపిల్ మొదలైనవి తినాలి. లేదా ఫ్రూట్ సలాడ్ తినచ్చు. వండిన ఇతర ఆహార పదార్ధాలు తినద్దు. ఇవి జీర్ణప్రక్రియలో శరీరంలోని ఎనర్జీని పూర్తిగా వాడేసి అలసట నిస్తాయి. లేదంటే, ఒక గ్లాసుడు పాలు తాగి పని మొదలుపెట్టండి. 2. స్నాక్స్: డ్రై ఫ్రూట్స్, వెజిటబల్ శాండ్విచ్ లేదా ఫ్రూట్ జ్యూస్, కొద్దిపాటి చాయ్, లేదా కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిది. నీరు ఉదయం వేళ పుష్కలంగా తీసుకోండి. డీహైడ్రేషన్ రాకుండా వుంటుంది. 3. లంచ్: లంచ్ లో రైస్ అయిటమ్స్ తీసుకోవద్దు. పచ్చటి ఆకు కూరలు, ఇతర పప్పులు, లేదా కాయ ధాన్యాలు, ఉడకపెట్టిన లేదా పచ్చి కూరలు మంచి పోషక విలువలనిస్తాయి.
పచ్చి కూరల రసం లో నీరు, ఖనిజలవణాలు, ఐరన్, అనేక ప్రోటీన్లు వుంటాయి. కేరట్లు, కాలీఫ్లవర్, గ్రీన్ బఠాణీలు, గోంగూర, ఇతర ఆకు కూరలు వండినవైనా పోషక విలువలు కలిగి వుంటాయి. 4. సాయంత్రం స్నాక్స్: వెజిటబుల్ సూప్, బ్రౌన్ బ్రెడ్ శాండ్ విచ్, కొద్దిపాటి వెన్న లేదా ఛీజ్. కొవ్వు తక్కువగా వున్న పాల ఉత్పత్తులు. పోషక విలువలు కల బిస్కట్లు, తక్కువ కేఫైన్ కల ఉత్పత్తులు. 5. రాత్రి భోజనం: డిన్నర్ లో కూరలు, పప్పు, చపాతి, వెజిటబుల్ సలాడ్. వెజిటబుల్ సూప్. రాత్రి భోజనం బెడ్ కు వెళ్ళటానికి మూడు లేదా నాలుగు గంటల ముందు తీసుకోవాలి. తీసుకునే ఆహారం ఆకలి స్ధాయినిబట్టి ఉండాలి కాని రుచిని బట్టి తినెయ్యరాదు. ఇలా తింటే, చక్కటి ఆరోగ్యంతో పాటు మహిళలు తమ ఉద్యోగాలను కూడా సమర్ధవంతంగా చేయగలుగుతారు.