గర్భధారణ సమయంలో మహిళలు జంక్ ఫుడ్‌ తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి..

గర్భధారణ సమయంలో మహిళలు సహజంగానే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఆ సమయంలో వికారంగా, వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. నోరు చేదుగా ఉంటుంది. కనుక కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలనిపిస్తుంది. అలాగే పులుపు, వగరు ఆహారాలను కూడా తింటారు. అంత వరకు బాగానే ఉన్నా జంక్‌ ఫుడ్‌ను కూడా కొందరు ఎక్కువే తింటారు. అయితే నిజానికి గర్భధారణ సమయంలో మహిళలు జంక్‌ ఫుడ్‌ను అస్సలు తినరాదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో మహిళలు జంక్ ఫుడ్‌ తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి..

 

1. జంక్‌ ఫుడ్‌లో నూనె, కొవ్వులు, చక్కెర, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల జంక్‌ ఫుడ్‌ను తింటే బరువు అధికంగా పెరుగుతారు. దీంతో ఇబ్బందులు వస్తాయి. సహజంగానే గర్భధారణ సమయంలో బరువు పెరుగుతారు. అదే జంక్‌ ఫుడ్‌ను తింటే ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు. దీంతో సమస్యల బారిన పడాల్సి వస్తుంది.

2. గర్భిణీలు జంక్‌ ఫుడ్‌ను ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది. అధిక బీపీ బారిన పడతారు. కనుక జాగ్రత్తగా ఉండాలి.

3. గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జంక్ ఫుడ్‌లో చక్కెర, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మధుమేహం బారిన పడతారు. ఇది అకాల ప్రసవానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గర్భిణీలు జంక్ ఫుడ్‌ను తినరాదు.

4. జంక్ ఫుడ్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల మెదడు, గుండె, ఊపిరితిత్తులు, ఎముకలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో పాటు బిడ్డ కడుపులో అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకుంటుంది. ఇది అస్సలు మంచిది కాదు.

5. గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ అధికంగా తింటే పుట్టబోయే బిడ్డ మెదడు అభివృద్ధిపై ప్రభావం పడుతుంది. దీంతోపాటు మహిళలకు అలర్జీలు, ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక గర్భిణీలు ఆ సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ జంక్‌ ఫుడ్‌ను తినరాదు. తినాలనిపిస్తే నట్స్‌ లేదా పండ్లను తింటే మేలు.

Admin

Recent Posts