బ్లాక్‌ సోయాబీన్‌ వల్ల ఎన్నో ఉపయోగాలు.. తరచూ తీసుకుంటే ఎంతో మంచిది..!

మాంసాహారంలో సహజంగానే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కానీ మాంసాహారానికి సమానంగా ప్రోటీన్లు ఉండే ఆహారం ఒకటుంది. అదే బ్లాక్‌ సోయాబీన్‌. వీటినే బ్లాక్‌ రాజ్మా అని పిలుస్తారు. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్‌ సోయాబీన్‌ వల్ల ఎన్నో ఉపయోగాలు.. తరచూ తీసుకుంటే ఎంతో మంచిది..!

1. బ్లాక్‌ సోయాబీన్‌ లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా అనిపించేలా చూస్తుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారం తక్కువగా తీసుకుంటాము. దీంతో అధిక బరువును తగ్గించుకోవడం సులభతరం అవుతుంది.

2. మాంసాహారం తినలేని వారు బ్లాక్‌ సోయాబీన్‌ ను తినవచ్చు. మాంసాహారాలకు సమానంగా ప్రోటీన్లు వీటిల్లో ఉంటాయి. దీని వల్ల కండరాల నిర్మాణం జరుగుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది.

3. బ్లాక్‌ సోయాబీన్‌ లో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య నుంచి బయట పడేస్తుంది. రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది.

4. బ్లాక్‌ సోయాబీన్‌ ను తరచూ తీసుకోవడం వల్ల అధిక బరువు తగ్గుతారు. వీటిలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

5. బ్లాక్‌ సోయాబీన్‌ లో విటమిన్‌ కె, మెగ్నిషియం, కాపర్, రైబో ఫ్లేవిన్‌లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాక పోషణను అందిస్తాయి.

6. కొలెస్ట్రాల్‌, బీపీ ఎక్కువగా ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

Admin

Recent Posts