Headache : మనలో చాలా మంది పార్శ్వపు తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. తలనొప్పి వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. చాలా మంది తలకు టవల్ తో గట్టిగా కట్టు కట్టి పడుకుంటూ ఉంటారు. 2 నుండి 3 రోజుల పాటు తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ను వాడుతూ ఉంటారు. దీర్ఘకాలంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. పార్శ్వపు తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందనే చెప్పవచ్చు. ఇలా తలనొప్పి సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి రావడానికి గల ప్రధాన కారణాల్లో మలబద్దకం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. ప్రేగుల్లో మలం పేరుకుపోవడం వల్ల మలాన్ని పట్టుకుని ఉండడం వల్ల కండరాలు ఒత్తిడికి గురి అవుతాయని దీంతో తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తలనొప్పి రావడానికి 100 కి 70 శాతం ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు. మల విసర్జన చేయకపోవడం వల్ల ఆకలి అవ్వదు. ఆకలి కాకపోయినప్పటికి నీరసం వస్తుందని ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యల కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పితో పాటు వికారంగా కూడా ఉంటుంది. తలనొప్పితో పాటు వికారంలో ఉండే అది జీర్ణ సమస్యల వచ్చే తలనొప్పి అని పొట్టశుభ్రంగా లేకపోవడం వల్ల ఇలా తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నీటిని తక్కువగా తాగడం వల్ల కూడా తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురి అయ్యి తలనొప్పి వస్తూ ఉంటుంది. అదే విధంగా మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువవడం వల్ల రక్తప్రసరణ తగ్గుతుంది. రక్తప్రసరణ తగ్గడం వల్ల రక్తనాళాలు సంకోచించడం వల్ల శరీరంలో హార్మోన్లలల్లో మార్పులు వచ్చి తలనొప్పి వస్తుంది. అలాగే టీ, కాఫీలు ఎక్కువగా తాగే వారిలో కూడా తలనొప్పి వస్తుంది. అలాగే సైనస్ కారణంగా కూడా కొందరిలో తలనొప్పి వస్తుంది. అలాగే మెడ కండరాల నొప్పుల కారణంగా కూడా కొందరిలో తలనొప్పి వస్తుంది. అదే విధంగా కంటి చూపులో సమస్యల కారణంగా కూడా తలనొప్పి వస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా అనేక కారణాల చేత తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి రాగానే చాలా మంది పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు.
పెయిన్ కిల్లర్ లను వాడడం వల్ల నొప్పి తగ్గుతుంది తప్ప సమస్య పూర్తిగా పరిష్కారం అవ్వదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు పెయిన్ కిల్లర్ లను వాడడానికి బదులుగా ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు ముందుగా టీ, కాఫీలను తాగడం పూర్తిగా మానేయాలి. టీ, కాఫీలు తాగాలనిపించినప్పుడు వేడి నీటిలో తేనె, నిమ్మరసం, తులసి ఆకులు కలిపి తీసుకోవాలి. అలాగే వేడి నీటిలో ఉసిరికాయ పొడిని కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. రోజూ రెండు సార్లు మలవిసర్జన అయ్యేలా చూసుకోవాలి.
నీటిని ఎక్కువగా తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో తలనొప్పి దానంతట అదే తగ్గుతుంది. అలాగే ఉదయం పూట, సాయంత్రం పూట పండ్లను ఆహారంగా తీసుకోవాలి. మధ్యాహ్నం మాత్రమే అన్నాన్ని ఆహారంగా తీసుకోవాలి. ఇలా పండ్లను తీసుకోవడం పొట్ట శుభ్రంగా అవుతుంది. దీంతో తలనొప్పి దాదాపుగా తగ్గిపోతుంది. ఈవిధంగా 10 నుండి 15 రోజుల పాటు పాటించడం వల్ల ఎటువంటి తలనొప్పైనా దాదాపుగా తగ్గిపోతుందని ఈ చిట్కాలు పాటించినప్పటికి తలనొప్పి తగ్గకపోతే అప్పుడు మాత్రమే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.