Meal Maker Curry : అన్నం, చ‌పాతీ.. ఎందులోకి అయినా స‌రే మీల్ మేక‌ర్ క‌ర్రీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Meal Maker Curry : ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో మీల్ మేక‌ర్ కూడా ఒక‌టి. మీల్ మేక‌ర్ లు కూడా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని చాలా మంది ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. వీటితో ర‌క‌ర‌కాల వంట‌కాలు తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. మీల్ మేక‌ర్ ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు ఈ వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మీల్ మేక‌ర్ మసాలా క‌ర్రీ కూడా ఒక‌టి. దేనితో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. మీల్ మేక‌ర్ ల‌తో రుచిగా వెరైటీ వంట‌కాల‌ను త‌యారు చేయాల‌నుకునే వారు ఇలా మ‌సాలా క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. మీల్ మేక‌ర్ ల‌తో రుచిగా, క‌మ్మ‌గా మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మీల్ మేక‌ర్ – 100 గ్రా., ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 2, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, జీడిపప్పు – 20, నూనె – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, క‌రివేపాకు -ఒక రెమ్మ‌, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – అర టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Meal Maker Curry with masala recipe very tasty to make
Meal Maker Curry

మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా మీల్ మేక‌ర్ ల‌ను వేడి నీటిలో వేసి ప‌ది నిమిషాల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత క‌ళాయిలో ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, జీడిప‌ప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత మీల్ మేక‌ర్ చేత్తో గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మీల్ మేక‌ర్ ల‌ను వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే క‌ళాయిలో మ‌రో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి.

త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన మీల్ మేక‌ర్ లు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి ఉడికించాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించిన త‌రువాత గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో నిమిషం పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, బ‌గారా అన్నం, జీరా రైస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన మీల్ మేక‌ర్ మ‌సాలా క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts