హెల్త్ టిప్స్

తిండికి ఓ పద్దతుంది తెలుసా..?

ఆకలైనప్పుడు తింటాం… వైనంగా వండుకుని తింటాం… అదీ తెలియదా అనకండి. రుచిగా వండుకుని కడుపునిండా సుష్టుగా తినడం చాలా మందికి ఇష్టమే. కానీ ఆరోగ్యానికే కష్టం. అందుకనే ఈ పద్దతుల గురించి చేప్పేది. పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నరంటే… వేళకు తినాలి. ఆకలి తీరగానే తినడం ఆపేయాలి. పదార్ధాలు రుచిగా ఉన్నాయని ఇంకాస్త తిందామనుకోకూడదు.

వండిన ఆహార పదార్ధాలు తినడానికి గంట ముందు పండ్లు తినాలి.ముందు వీలు కాకపోతే అన్నం తిన్నాక మూడు గంటలు ఆగి అప్పుడు పండ్లు తీసుకోవచ్చు అంతేకానీ అటు చేయి కడుక్కుని వచ్చి ఇటు పండ్లు లాగించెయ్యాలనుకోవద్దు. రాత్రి భోజనం తొమ్మిది గంటల లోపే చేయాలి. చేయగానే పడక ఎక్కకుండా కాసేపు నడక, ఇతరాత్రా పనులు చక్కబెట్టుకోవడం అవసరం.

you must follow these rules while eating

తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకునవారు మొలకెత్తిన రూపంలో వాటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే వాటి నుంచి పూర్తి పోషకాలు అందుతాయి. వండిన పదార్ధాలు తీసుకునే ప్రతిసారీ పచ్చి కూరగాయల సలాడ్, దాని మీద కాస్త నిమ్మరసం చల్లి తీసుకోవాలి.

Admin

Recent Posts