హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

అమెరికాలో 2008 సంవత్సరంలో రికార్డు పరంగా 24 మిలియన్లమంది డయాబెటీస్ రోగులుంటే, రికార్డుకు రాని వారి సంఖ్య మరో 6 మిలియన్లు, డయాబెటీస్ ఇక కొద్ది రోజులలో వస్తుందనే వారి సంఖ్య సుమారు 57 మిలియన్లు వున్నట్లు గణాంకాలు తెలిపాయి. ఈ గణాంకాలు నేటికి మరింత అధికంగా వుంటాయి. అమెరికాలో మరణాలకుగల ప్రధాన కారణాలలో షుగర్ వ్యాధి ఒకటి. డయాబెటీస్ లేదా డయాబెటీస్ మెల్లిటస్ అనేది వ్యక్తి శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ స్ధాయిని నియంత్రించటం.

ఈ గ్లూకోజు స్దాయి ఇన్సులిన్ అనే హార్మోన్ తో నియంత్రించబడతాయి. ఇన్సులిన్ సరఫరాలో వచ్చే మార్పులు డయాబెటీస్ వ్యాధిని కలిగిస్తాయి. షుగర్ వ్యాధి కలిగిన వ్యక్తి లక్షణాలు ఎలావుంటాయంటే…. తరచుగా మూత్రం పోయటం, విపరీతమైన దాహం మరియు ఆకలి, అలసట, లేక అసాధారణంగా నీరసపడటం, బరువు తగ్గటం, శ్వాస కష్టంగా తీసుకోవడం, వికారం, వాంతులు, చర్మం దురదలు, నయం కాని పండ్లు, కడుపు నొప్పి, దృష్టి మందగించడం, చేతులు, కాళ్ళు తిమ్మిర్లెక్కడం, తరచుగా చర్మం, లేదా చిగుళ్ళ్లు, జననాంగాలు ఫంగస్ బారిన పడటంగా వుంటాయి.

you must observe these diabetes symptoms

చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. ఈ లక్షణాల ఆధారంగా షుగర్ వ్యాధిని టైప్ 1, టైప్ 2 అని వర్గీకరించారు. స‌రైన ఆహారం తింటూ ఆరోగ్య‌వంత‌మైన జీవ‌న విధానాన్ని పాటిస్తే డ‌యాబెటిస్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అంటున్నారు. అలాగే వ్యాయామం కూడా త‌ప్ప‌నిస‌రి అని సూచిస్తున్నారు.

Admin

Recent Posts