Off Beat

ముంగీసను పాము కరిస్తే విషం ఎందుకు ఎక్కదు?

శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి ముంగిస నాకు మిత్రుడే. ఆ విషయం దానికి తెలియదనుకోండి. ఎప్పుడూ చెప్పే అవకాశం దొరకలేదు. మిత్రుడు అన్నాక మిత్రుడి గురించి చెప్పకపోతే పాపం కాబట్టి – ఇవిగోండి వివరాలు – పాముకి ముంగిసకు మధ్య జరిగే పోరులో ఎక్కువ శాతం ముంగిసనే గెలుస్తుంది. అధికారికంగా దొరుకుతున్న గణాంకాలు తెలిపిన విషయం ఇది. పాముతో గొడవలో ముంగిస చాలా అలర్ట్ గా ఉంటుంది. కాటు పడకుండా వీలయినంతగా తప్పించుకుంటుంది. పాము విషం ఒక మోతాదు వరకు ఇమ్యూన్ చేసుకునే శక్తి ముంగిసలో ఉంది. అయితే ఒక మోతాదు వరకు మాత్రమే.

మిగతా జీవులతో పోలిస్తే – జన్యుపరంగా కొంత నిరోధకశక్తి ముంగిసలో ఉంటుందన్న మాట నిజమే. సాధారణంగా పాము విషం నరాల్లో/కండరాల్లో చేరి ప్రభావం చూపిస్తుంది కదా, కానీ ముంగిసలో ఉండే ఎసిటైల్ కోలిన్ గ్రాహకాలు అలా ప్రభావం చూపకుండా నిరోధిస్తాయి. మితంగా విషం శరీరంలో ప్రవేశించినా గ్లైకో ప్రోటీన్ ఉత్పత్తి చేసుకోవటం ద్వారా ప్రాణాపాయం నుండి గట్టెక్కుతాయి. తన వంటిపై ఉన్న ఫుర్ (బొచ్చు) ని గట్టిగా బిగించి, దాని పరిమాణం కంటే రెండింతలు అయి పాము కాటు తనని చేరకుండా కాపాడుకుంటుంది. ముంగిసల్లో మొత్తంగా 29 రకాల జాతులు ఉన్నాయి. చూడటానికి వేర్వేరుగా ఉంటాయి. చిన్న చెవులు, పొడవుగా ఉండే శరీరం మాత్రమే కామన్.

why mongoose is very much resistant to snake poison

ముంగిసలను సైంటిస్టులు నాన్ డిస్క్రిమినేటరీ ప్రెడేటర్స్ అని అంటారు. ఎందుకంటే అవి వెంటాడే వాటిని, చంపిన వాటిని కచ్చితంగా తినేస్తాయి. ఒక ద్వీపంలో అవి చేసేంత డ్యామేజ్ మరేదీ చేయదట. అందుకే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వీటిని పెట్స్ గా ఉంచటం నిషేధించారు. ఒక్క హవాయిలో తప్ప ఎక్కడా కూడా వీటిని పెంచుకోవటానికి లేదు. అంత డ్యామేజ్ చేసే జీవులు ఇవి.

Admin

Recent Posts