Weight : అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుతం చాలా మందికి అత్యంత కష్టంగా మారింది. అధిక బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదని వాపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన విధంగా రోజూ తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పలు రకాల పండ్లను రోజూ తినాలి. దీంతో బరువు వేగంగా తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. రోజూ ఎలాంటి పండ్లను తింటే బరువు వేగంగా తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నారింజల్లో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని తింటే బరువు తగ్గేందుకు సహాయ పడతాయి. అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఒక నారింజ పండును తినాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు, లంచ్‌కు మధ్య లేదా మధ్యాహ్నం భోజనం అనంతరం 2 గంటల గ్యాప్ ఇచ్చి ఒక నారింజ పండును రోజూ తినాలి. దీంతో బరువు వేగంగా తగ్గవచ్చు.
2. పుచ్చకాయలను సహజంగానే వేసవిలో అధికంగా తింటుంటారు. అయితే వీటిని ఏ కాలంలో అయినా తినవచ్చు. వీటిలో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. కనుక బరువు తగ్గేందుకు సహాయ పడతాయి. పుచ్చకాయల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, లైకోపీన్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కొవ్వును కరిగిస్తాయి. రోజూ ఒక కప్పు పుచ్చకాయ ముక్కలను తింటే ఎంతో మేలు జరుగుతుంది.
3. రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని అంటుంటారు. అది అక్షరాలా నిజమే అని చెప్పవచ్చు. యాపిల్ పండును రోజుకు ఒకటి తినడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది.
4. బొప్పాయి పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది. జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది. రోజుకు ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలను తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు.
5. స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలు, చెర్రీ.. వంటి పండ్లను కూడా రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. వీటిల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే ఫైబర్, విటమిన్ సి, మాంగనీస్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బీపీని అదుపులో ఉంచుతాయి. వాపులను తగ్గిస్తాయి. దీంతోపాటు బరువును తగ్గించడంలో సహాయ పడతాయి.