Millets : మనం చాలా కాలం నుండి బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. బియ్యాన్ని రవ్వగా చేసి ఉప్మా వంటివి తయారు చేయడం, దోశలు, ఉతప్పలు వంటి వాటి తయారీలో కూడా మనం బియ్యాన్ని వాడుతూ ఉంటాం. భారత దేశంలో అధికంగా పండించే వాటిల్లో బియ్యం ఒకటి. చాలా మందికి బియ్యం ప్రధాన ఆహారంగా ఉంది. బియ్యాన్ని ప్రధానంగా వాడడం వల్ల మిగిలిన ధాన్యాలు అన్నీ మరుగున పడి పోయాయి. పూర్వ కాలంలో బియ్యాన్ని చాలా తక్కువగా వాడేవారు. ఇంట్లో శుభ కార్యాలు వంటివి జరిగినప్పుడు మాత్రమే బియ్యంతో అన్నాన్ని వండేవారు. శుభ కార్యాలు తప్ప మిగిలిన రోజులల్లో రాగులు, కొర్రలు, అరికెలు, వరగులు, సజ్జలు, జొన్నలు, సామలు, ఊదలు వంటి చిరు ధాన్యాలను మాత్రమే వాడేవారు.
బియ్యాన్ని ఫ్రధాన ఆహారంగా తీసుకోవడం ప్రారంభించిన దగ్గరి నుండి ఈ చిరు ధాన్యాల వాడకం తగ్గింది. బియ్యాన్ని ప్రధాన ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి హాని కలుగుతుందనే చెప్పవచ్చు. శరీరానికి తెల్ల అన్నం చేసినంతా హానిని ఏ ఇతర ఆహార పదార్థాలు చేయవని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన ధాన్యాలతో పోల్చినప్పుడు బియ్యంలో మాత్రమే అతి తక్కువ పోషకాలు, పీచు పదార్థాలు ఉంటాయని, అలాగే అతి ఎక్కువ కార్బొహైడ్రేట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
బియ్యాన్ని వండినప్పుడు పొడిపొడిగా జిగురులేకుండా ఉంటుంది. అంతే కాకుండా బియ్యాన్ని వండిన తరువాత తినడానికి చాలా సులువుగా, రుచిగా ఉంటాయి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. కనుక బియ్యం ప్రధాన ఆహారంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో వస్తున్న అనారోగ్య సమస్యల కారణంగా వైద్యులు బియ్యం వాడకాన్ని తగ్గించమని చెబుతున్నారు. అలాగే చిరు ధాన్యాలలో ఉండే పోషక విలవలు, వాటి వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి కూడా నిపుణులు పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రస్తుత కాలంలో చిరు ధాన్యాలను పండించే వారు, వాటిని ఆహారంగా తీసుకునే వారు రోజురోజుకీ ఎక్కువవవుతున్నారు.
బియ్యంలో కంటే చిరు ధాన్యాలన్నింటిలో కార్బొహైడ్రేట్స్ తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చిరు ధాన్యాలన్నింటిలోనూ కొర్రలు తక్కువ ధరలో దొరకడమే కాకుండా వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నాన్ని తినడానికి బదులుగా ఏదో ఒక చిరు ధాన్యాన్ని వండుకొని తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. బియ్యం వాడకాన్ని తగ్గించి చిరు ధాన్యాలను రవ్వగా చేసుకుని అల్పహారంలో కూడా ఉపయోగించవచ్చు.
వీటిని పిండిగా చేసుకుని చపాతీ, పుల్కా, స్నాక్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పూర్వ కాలంలో లాగా మనం కూడా బియ్యాన్ని పర్వ దినాలలో, శుభ కార్యాలలో మాత్రమే వాడుకోవడం ప్రారంభించాలి. చిరు ధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువును తగ్గించడంతోపాటు రక్తంలో షుగర్ స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకున్నప్పుడు మనం చేసే శారీరక శ్రమకు తగట్టుగానే తక్కువ మొత్తంలో ఆహారంగా తీసుకోవాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.