Onions : వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మంది తమ శరీరాన్ని చల్లగా ఉంచుకునే మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పదార్థాలు, పానీయాలను ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే వేసవిలో ఉల్లిపాయలను కూడా తీసుకోవాల్సిందే. ఉల్లిపాయల్లో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

1. వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కనుక ఉల్లిపాయలను ఈ సీజన్‌లో రోజూ తినాలి. రోజుకు 2-3 ఉల్లిపాయ ముక్కలను తింటే ప్రయోజనం కలుగుతుంది. దీంతో శరీరం చల్లగా ఉంటుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు.
2. ఈ సీజన్‌లో గ్యాస్, కడుపులో మంట, విరేచనాలు అధికంగా అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే వేడి కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఉల్లిపాయలను తింటుంటే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ఉల్లిపాయ గుజ్జులో చక్కెర కలుపుకుని తింటే మూత్రం కూడా బొట్లు బొట్లుగా కాకుండా ధారాళంగా వస్తుంది. మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. ఉల్లిపాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయల్లో అధికంగా ఉంటే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది.
4. డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఉల్లిపాయలను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. ఉల్లిపాయలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.