చికెన్ అంటే అందరికీ ఇష్టమే. చికెన్ తో అనేక రకాల వంటకాలను చేసి తింటుంటారు. చికెన్ కర్రీ, వేపుడు, బిర్యానీ.. ఇలా రకరకాల చికెన్ వంటకాలను నాన్ వెజ్ ప్రియులు ఆస్వాదిస్తుంటారు. అయితే పోషకాల విషయానికి వస్తే చికెన్‌లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు శక్తిని అందిస్తాయి. కండరాల నిర్మాణానికి దోహదం చేస్తాయి. అలాగే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ కూడా మనకు చికెన్ ద్వారా లభిస్తాయి. అయితే చికెన్‌కు చెందిన 4 భాగాలను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది చికెన్ మెడ అంటే ఇష్టంగా తింటారు. కానీ ఈ భాగంలో చికెన్ లింఫ్ వ్యవస్థ ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను, బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది. కనుక చికెన్ మెడను తింటే మన శరీరంలోకి అవన్నీ చేరుతాయి. ఇది మనకు ఎంతో హాని చేస్తుంది. కనుక చికెన్ మెడ తినకూడదు. అలాగే చికెన్ తోక భాగాన్ని కూడా తినకూడదు. ఈ భాగంలో కూడా అనేక క్రిములు, బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్య సమస్యలను కలగజేస్తాయి. కనుక ఈ భాగాన్ని కూడా తినకూడదు.
చికెన్ ఉలవకాయను కూడా తినకూడదు. అందులో ఆహారం జీర్ణమవుతుంది. అనేక బ్యాక్టీరియా, క్రిములు ఉంటాయి. కాబట్టి ఈ భాగాన్ని కూడా వదిలేయాలి. చికెన్ ఊపిరితిత్తులను కూడా తినకూడదు. వీటిల్లోనూ అనేక క్రిములు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కనుక చికెన్‌కు చెందిన ఈ 4 భాగాలను వదిలేయాలి. తింటే వ్యాధులు వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.