ఆరోగ్యం

జ‌లుబు ఎక్కువ‌గా ఉందా ? ఈ చిట్కాల‌ను పాటిస్తే వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు..!

సీజ‌న్లు మారిన‌ప్పుడల్లా మ‌న‌లో చాలా మందికి స‌హ‌జంగానే జ‌లుబు వ‌స్తుంటుంది. దీంతో తీవ్ర‌మైన ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. జ‌లుబుతోపాటు కొంద‌రికి ముక్కు దిబ్బ‌డ‌, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు కూడా ఉంటాయి. అయితే కింద తెలిపిన అద్భుత‌మైన చిట్కాల‌ను పాటిస్తే జ‌లుబు ఇట్టే త‌గ్గిపోతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే..

home remedies for cold

 

* 50 గ్రాముల బెల్లానికి ఒక‌టిన్న‌ర టీస్పూన్ వామును క‌లిపి మెత్త‌గా నూరి రెండు గ్లాసుల నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ అయ్యాక స్ట‌వ్ మీద నుంచి దించి చ‌ల్లారిన త‌రువాత వ‌డ‌క‌ట్టి రెండు పూట‌లా తాగితే చాలు జ‌లుబు మాయ‌మ‌వుతుంది.

* న‌ల్ల జీల‌క‌ర్ర‌ను కొద్దిగా మంచి వ‌స్త్రంలో మూట‌క‌ట్టి అప్పుడ‌ప్పుడు కొద్దిగా న‌లుపుతూ వాస‌న పీలుస్తుంటే ముక్కు దిబ్బడ త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

* దాల్చిన చెక్క‌, ప‌సుపు, జాప‌త్రి, ల‌వంగాల‌ను స‌మానంగా తీసుకుని బాగా నూరి అందులో తేనె క‌లిపి పూట‌కు ఒక టీస్పూన్ చొప్పున తీసుకుంటే జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

* శొంఠి క‌షాయాన్ని రాత్రి ప‌డుకునే ముందు పావు క‌ప్పు చొప్పున తాగితే జ‌లుబు నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

* సాంబ్రాణి పువ్వును వ‌స్త్రంలో చుట్టి మూట క‌ట్టి అప్పుడ‌ప్పుడు వాస‌న పీల్చినా జ‌లుబు త‌గ్గుతుంది.

* మిరియాలు, అల్లం, తుల‌సి ఆకుల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని బాగా నూరి వీటితో క‌షాయం కాచి పూట‌కు పావు క‌ప్పు చొప్పున నిత్యం 3 పూట‌లా తీసుకోవాలి. దీంతో జ‌లుబును త‌గ్గించుకోవ‌చ్చు.

* చిన్న క‌ర‌క్కాయ‌లు, తెల్ల క‌విరి స‌మానంగా తీసుకుని బాగా క‌లిపి నూరి ఉడికించాలి. ముక్కు పైన ప‌ట్టులా వేయాలి. దీంతో జ‌లుబు త‌గ్గుతుంది.

* మంచి గంధాన్ని వాస‌న చూస్తే తుమ్ములు త‌గ్గుతాయి. కొత్తిమీర వాస‌న చూసినా తుమ్ములు త‌గ్గుతాయి.

Admin

Recent Posts