ఆరోగ్యం

దోమ‌లు ఎక్కువ‌గా ఉన్నాయా ? ఇలా చేయండి.. దెబ్బ‌కు దోమ‌లు పారిపోతాయి..!

దోమ‌ల వ‌ల్ల అనేక ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. ముఖ్యంగా వ‌ర్షాకాలం సీజ‌న్‌లో దోమ‌ల‌తో ఎక్కువ‌గా వ్యాధులు వ‌స్తాయి. డెంగ్యూ, మ‌లేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు దోమ‌లు కుట్ట‌డం వ‌ల్లే వ‌స్తాయి. అందువ‌ల్ల దోమ‌ల‌ను నాశ‌నం చేయాలి. దోమ‌లు కుట్ట‌కుండా చూసుకోవాలి. దీంతో ఆయా వ్యాధులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అయితే కింద తెలిపిన స‌హ‌జ‌సిద్ధ‌మైన మ‌స్కిటో రీపెల్లెంట్స్ దోమ‌ల‌ను దూరంగా త‌రిమేస్తాయి. మ‌రి వాటి గురించి తెలుసుకుందామా..!

if you have mosquitoes in your home then follow these tips to get rid of them

1. వెల్లుల్లి నీరు

వెల్లుల్లి నీరు దోమల నుండి బయటపడటానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వెల్లుల్లి రెబ్బ‌లను కొన్ని తీసుకుని పేస్ట్‌లా చేసి ఆపై వాటిని నీటిలో ఉడకబెట్టాలి. ఆ తరువాత ఆ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి ఇంట్లో అన్ని గ‌దుల్లోనూ, త‌లుపులు, కిటికీల వ‌ద్ద స్ప్రే చేయాలి. ఇలా చేస్తే దోమలు తక్షణమే న‌శిస్తాయి.

2. లెమ‌న్ గ్రాస్

లెమ‌న్ గ్రాస్ మొక్క‌ల ఆకుల‌ను మిశ్రమంగా చేసి దాన్ని శ‌రీరానికి రాసుకోవ‌చ్చు. లేదా లెమ‌న్ గ్రాస్ ఆయిల్‌ను కూడా రాసుకోవ‌చ్చు. దీంతో దోమ‌లు కుట్ట‌వు.

3. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్

యాపిల్ సైడర్ వెనిగర్ లేదా సాధారణ వెనిగర్ రెండూ దోమల నుండి బయటపడటానికి సహాయపడతాయి. 3 కప్పుల నీరు, 1 కప్పు వెనిగర్ క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని స్ప్రే బాటిల్‌లో పోయాలి. దాన్ని ఇంట్లో స్ప్రే చేయాలి. దోమ‌లు పారిపోతాయి.

4. నిమ్మకాయ‌, లవంగాలు

దోమలను దూరంగా ఉంచడానికి నిమ్మకాయ, లవంగాలు బాగా ప‌నిచేస్తాయి. ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని, అందులో 2 లవంగాలను చొప్పించి గదిలో ఉంచాలి. ఇలా చేస్తే దోమల‌ను దూరంగా త‌ర‌మ‌వ‌చ్చు.

5. లావెండర్ ఆయిల్

లావెండర్ నూనె వాసన దోమల‌కు ప‌డ‌దు. అందువ‌ల్ల ఈ నూనెలో కొద్దిగా నీరు క‌లిపి స్ప్రే చేసినా దోమ‌లు రాకుండా ఉంటాయి.

6. తులసి

తుల‌సి ఆకుల ర‌సాన్ని నీటిలో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి ఇంట్లో స్ప్రే చేయాలి. దోమ‌లు పారిపోతాయి.

7. కర్పూరం

పావు కప్పు నీటిలో రెండు కర్పూరం బిళ్ల‌ల‌ను వేసి ఆ మిశ్ర‌మాన్ని ఇంట్లో స్ప్రే చేయాలి. లేదా గదిలో కొంత కర్పూరం కాల్చి, అన్ని తలుపులు, కిటికీలను మూసివేసి, సుమారుగా 20 నిమిషాలు ఉంచాలి. దీంతో దోమ‌లు పారిపోతాయి.

8. పెప్ప‌ర్‌మింట్ ఆయిల్

పెప్ప‌ర్‌మింట్ ఆయిల్ దోమలను త‌రిమేస్తుంది. కొన్ని చుక్కల పెప్ప‌ర్‌మింట్ ఆయిల్ ను ఒక కప్పు నీటిలో క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని స్ప్రే బాటిల్ లో పోయాలి. దాన్ని స్ప్రే చేయాలి. దోమ‌లు రావు.

9. కొబ్బరి నూనె, వేప నూనె

కొబ్బరి నూనె, వేప నూనె మిశ్ర‌మం సహజ సిద్ధ‌మైన‌ వికర్షకంగా పనిచేస్తుంది. ఇది దోమ‌ల‌ను త‌రిమేస్తుంది. కొబ్బరి నూనె, వేప నూనెల‌ను కొంత మోతాదులో తీసుకుని ఆ రెండింటిని నీటిలో కలిపి స్ప్రే చేయాలి. దోమ‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

10. కాఫీ

కాఫీ గింజ‌ల‌ను కాల్చ‌డం వ‌ల్ల వ‌చ్చే పొగ కూడా దోమ‌ల‌కు ప‌డ‌దు. క‌నుక ఇలా చేసినా దోమ‌లు పారిపోతాయి.

Admin

Recent Posts