వేగంగా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా ? అయితే జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగండి.. ఇంకా ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు..!

భార‌తీయులు త‌మ ఆహారాల్లో రోజూ జీల‌క‌ర్ర‌ను వాడుతుంటారు. వీటిని సాధార‌ణంగా పెనంపై వేయించి పొడి చేసి కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే వంట‌ల‌కే కాదు, ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలోనూ జీల‌క‌ర్ర ప‌నిచేస్తుంది. దీంతో బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు.

వేగంగా బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా ? అయితే జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగండి.. ఇంకా ఎన్నో లాభాలు పొంద‌వ‌చ్చు..!

రోజూ రాత్రి ఒక టీస్పూన్ జీల‌క‌ర్ర‌ను ఒక గ్లాస్ నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపునే ఆ నీటిని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి.

జీల‌క‌ర్ర‌లో థైమోల్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది పిండిప‌దార్థాలు, కొవ్వుల‌ను జీర్ణం చేయ‌డంలో స‌హాయ ప‌డుతుంది. అలాగే ఆల్డిహైడ్ అనే మ‌రో స‌మ్మేళ‌నం జీల‌క‌ర్ర‌లో ఉంటుంది. ఇది జీర్ణాశ‌య ఎంజైమ్‌ల ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. దీంతో మెట‌బాలిజం పెరుగుతుంది. ఇన్సులిన్ నిరోధ‌క‌త త‌గ్గుతుంది. ఫ‌లితంగా కొవ్వు క‌రిగి బరువు త‌గ్గుతారు. మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

జీల‌క‌ర్ర నీటిలో క్యాల‌రీలు అత్యంత త‌క్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల ఈ నీళ్లు బ‌రువు త‌గ్గేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గే ప్ర‌క్రియ వేగవంతం అవుతుంది. బ‌రువు త‌గ్గేందుకు మెట‌బాలిజం పెర‌గ‌డం ముఖ్యం. క‌నుక జీల‌క‌ర్ర నీళ్లు మెట‌బాలిజంను పెంచుతాయి. దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డం వేగ‌వంతం అవుతుంది.

ఆక‌లిపై నియంత్ర‌ణ లేనివారు, తీవ్ర‌మైన ఆక‌లి స‌మ‌స్య ఉన్న‌వారు జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగుతుండ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ్చు. దీంతో ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అధికంగా ఆహారం తీసుకోకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. దీంతో బ‌రువు త‌గ్గడం సుల‌భ‌త‌రం అవుతుంది.

అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌లు ఉన్నా కూడా బ‌రువు త‌గ్గ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. కానీ జీల‌కర్ర నీళ్ల‌ను తాగితే ఆ స‌మ‌స్య‌లు ఉండ‌వు. అందువ‌ల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

Share
Admin

Recent Posts