Ayurvedic Buttermilk : మజ్జిగతో ఆయుర్వేద పానీయం.. రోజూ ఒక్క గ్లాస్‌ తాగితే చాలు..!

Ayurvedic Buttermilk : వేసవిలో మనల్ని అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా వేసవి తాపం అధికంగా ఉంటుంది. శరీరం ఎల్లప్పుడూ వేడిగా ఉంటుంది. ద్రవాలు త్వరగా ఖర్చయిపోతుంటాయి. ఎండదెబ్బ తాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక జీర్ణ సమస్యలు సరే సరి. తరచూ విరేచనానికి వెళ్లాల్సి వస్తుంది. అయితే కింద చెప్పిన విధంగా మజ్జిగతో తక్ర ఏలా అనే ఆయుర్వేద పానీయాన్ని తయారు చేసి రోజుకు ఒక్క గ్లాస్‌ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. ముఖ్యంగా పైన తెలిపిన అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరి తక్ర ఏలా పానీయాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

Ayurvedic Buttermilk drink one glass daily
Ayurvedic Buttermilk

తక్ర ఏలా పానీయం తయారీకి కావల్సిన పదార్థాలు..

పెరుగు – ఒక కప్పు, నీళ్లు – మూడు కప్పులు, చక్కెర – తగినంత, యాలకులు – రెండు (పొడి చేసినవి), రోజ్‌వాటర్‌ – ఒక టీస్పూన్‌.

తక్ర ఏలా పానీయం తయారు చేసే విధానం..

పెరుగుని చక్కగా చిలికి ఇందులో నీళ్లు, తగినంత చక్కెర, రోజ్‌ వాటర్‌, యాలకుల పొడి వేసుకుంటే ఈ పానీయం సిద్ధమవుతుంది. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అయ్యాక తాగవచ్చు. లేదా చల్లని నీళ్లతోనూ దీన్ని తయారు చేసుకుని అప్పటికప్పుడే తాగవచ్చు.

ఈ పానీయాన్ని తాగడం వల్ల పిత్త దోషం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు అన్నీ పోతాయి. వేడి తగ్గుతుంది. శరీరం చల్లగా మారుతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. ఎండలో వెళ్లి వచ్చినవారు లేదా ఎండలోకి వెళ్లే ముందు ఈ పానీయాన్ని తాగితే ఎండదెబ్బ బారిన పడకుండా ఉంటారు. అలాగే అధిక దాహం, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పానీయాన్ని మధ్యాహ్నం భోజనం చేశాక ఒక గంట విరామం ఇచ్చి తాగితే మంచిది.

Share
Admin

Recent Posts