Belly Fat Drink : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే.. పొట్ట దగ్గ‌రి కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది..!

Belly Fat Drink : ప్ర‌స్తుత త‌రుణంలో జీవన విధానంలో, ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌ బారిన ప‌డుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధికంగా బ‌రువు ఉండ‌డం వ‌ల్ల ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల ముఖ్యంగా గుండె సంబంధ‌ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

Belly Fat Drink take daily on empty stomach for better health
Belly Fat Drink

అధిక బ‌రువు ఉండే వారు బ‌రువు త‌గ్గ‌డానికి ర‌క‌రకాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం, వ్యాయామం, యోగాస‌నాలు, వాకింగ్ చేయ‌డం వంటివి చేస్తూ ఉంటారు. వీటితోపాటు స‌హ‌జ సిద్దంగా ఇంట్లో ఉండే ఆహార ప‌దార్థాల‌ను ఉప‌యోగించి కూడా మ‌నం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇంట్లో ఉండే నిమ్మ కాయ, అల్లాన్ని ఉప‌యోగించి మ‌నం వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. నిమ్మ కాయ, అల్లంల‌లో ఉండే ఔష‌ధ‌ గుణాలు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగేలా చేసి వేగంగా బ‌రువు త‌గ్గ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇందుకోసం ముందుగా అల్లాన్నిపేస్ట్ లా లేదా క‌చ్చా ప‌చ్చాగా చేసుకోవాలి.

రెండు పెద్ద నిమ్మ‌కాయ‌ల‌ను ప‌లుచ‌ని ముక్క‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నాలుగు క‌ప్పుల నీళ్ల‌ను పోసి వేడి అయ్యే వర‌కు ఉంచాలి. నీళ్లు వేడి అయ్యాక ఒక టేబుల్ స్పూన్‌ అల్లం పేస్ట్, నిమ్మకాయ ముక్కల‌ను వేసి మూడు గ్లాసుల నీళ్లు అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత ఒక గ్లాసులోకి వ‌డ‌క‌ట్టుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే తాగాలి.

ఇక ఇందులో రుచి కోసం తేనెను కూడా వేసుకోవ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌డ‌మే కాకుండా, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా క‌రుగుతుంది. అంతే కాకుండా శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి సాధార‌ణ జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం వంటివి రాకుండా ఉంటాయి. ఇలా నిమ్మ‌కాయ‌, అల్లంతో క‌షాయాన్ని చేసుకుని తాగ‌డం వ‌ల్ల త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌డ‌మే కాకుండా, ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

D

Recent Posts