Detox Drink : మన శరీరంలో అనేక రకాల సమస్యలకు ప్రధాన కారణం జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడమే. జీర్ణక్రియ సరిగ్గా ఉంటే ఎలాంటి వ్యాధులు రావు. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోతేనే అనేక వ్యాధులు వస్తుంటాయి. ఇక దీని కారణంగానే పెద్దపేగులోనూ మలం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దీంతో మలబద్దకం సమస్య వస్తుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇది ఇతర వ్యాధులకు కారణమవుతుంది. కనుక ఈ విధంగా జరగకుండా ఉండాలంటే పెద్దపేగును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు కింద తెలిపిన పానీయాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాల్సి ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్దపేగును శుభ్ర పరిచే డిటాక్స్ పానీయం తయారీకి కావల్సిన పదార్థాలు..
* గోరు వెచ్చని నీళ్లు – అర కప్పు
* యాపిల్ పండు జ్యూస్ – అర కప్పు
* అల్లం రసం – ఒక టీస్పూన్
* సముద్రపు ఉప్పు (గల్లుప్పు) – అర టీస్పూన్
* నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం..
పైన చెప్పిన అన్ని పదార్థాలను బాగా కలిపి మిక్స్ చేయాలి. ఉదయం పరగడుపున ఈ డ్రింక్‌ను తాగేయాలి. 1 గంట వరకు ఏమీ తీసుకోకూడదు. దీంతో పెద్ద పేగులో ఉండే వ్యర్థాలు బయటకు వస్తాయి. పెద్ద పేగు శుభ్రంగా మారుతుంది. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపవచ్చు. అనేక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
ఈ డిటాక్స్ డ్రింక్‌ను రోజూ తాగడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా అనేక ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.