ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగినన్ని గంటలపాటు నిద్రపోవాలి. పౌష్టికాహారాన్ని వేళకు తీసుకోవాలి. తగినంత నీటిని తాగాలి. అలాగే రోజూ వ్యాయామం కూడా చేయాలి. ఈ క్రమంలోనే చాలా మంది తమ అనుకూలతలను, స్థోమతను బట్టి రోజూ రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే శరీరానికి అధికంగా ఉపయోగపడే వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒకటి. నిజానికి 45 నిమిషాల పాటు వాకింగ్ చేయడం కన్నా 10 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తేనే ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా స్కిప్పింగ్ చేస్తే అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్కిప్పింగ్ ఓ చక్కని కార్డియో వ్యాయామం అని చెప్పవచ్చు. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెకు వ్యాయామం అవుతుంది. శరీరంలో అన్ని అవయవాలకు రక్తం, ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవుతాయి. స్కిప్పింగ్ చేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. గుండెకు ఎంతగానో మేలు జరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
2. స్కిప్పింగ్ చేయడం వల్ల కాళ్లు, పొట్ట, నడుం దగ్గర భాగాల్లో వ్యాయామం అవుతుంది. ఆయా భాగాలు చక్కని ఆకృతిని పొందుతాయి. అక్కడ ఉండే కండరాలు దృఢంగా మారుతాయి. శక్తి లభిస్తుంది. దృఢంగా మారుతారు.
3. అధిక బరువును తగ్గించుకునేందుకు స్కిప్పింగ్ ఒక చక్కని వ్యాయామం అని చెప్పవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేస్తే 300 క్యాలరీల వరకు కరిగించవచ్చు. దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు. శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది.
4. స్కిప్పింగ్ చేయడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. రోజూ కనీసం 15 నిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా చాలు శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో చర్మానికి పోషకాలు అందుతాయి. చర్మంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. చర్మం శుభ్రంగా మారుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది.
5. మనకు 35 సంవత్సరాల తరువాత ఎముకల్లో ద్రవ్యరాశి తగ్గుతుంది. దీంతో ఎముకలు పెళుసుగా మారి సులభంగా విరిగిపోతాయి. ఈ క్రమంలో విరిగిన ఎముకలు అతుక్కునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అదే రోజూ స్కిప్పింగ్ చేస్తే ఇలాంటి సమస్యలు రావు. పైగా ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సమస్యలు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక స్కిప్పింగ్ చేయడం వల్ల ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
6. చాలా మంది మార్షల్ ఆర్టిస్టులు, అథ్లెట్లు, బాక్సర్లు, టెన్నిస్ ప్లేయర్లు స్కిప్పింగ్ రోజూ చేస్తారు. ఎందుకంటే స్కిప్పింగ్ వల్ల శరీరం బ్యాలెన్స్‌ను పొందుతుంది. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కాబట్టి రోజూ స్కిప్పింగ్ చేయడం మంచిది. జిమ్‌కు వెళ్లలేని వారు, ఎక్కువ ఖరీదైన సామగ్రిని వాడలేని వారు స్కిప్పింగ్‌తో అద్భుతమైన లాభాలను పొందవచ్చు.
7. స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం మొత్తానికి వ్యాయమం అవుతుంది. అన్ని భాగాలు వ్యాయామానికి లోనవుతాయి. దీంతో అన్ని భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు రావు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365