అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించే వివిధ రకాల టీలు..!

అధిక బరువు.. పొట్ట దగ్గరి కొవ్వు.. అనేవి ప్రస్తుతం చాలా మందికి సమస్యలుగా మారాయి. వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది భిన్న రకాల పద్ధతులను పాటిస్తున్నారు. అయితే కింద తెలిపిన టీలను తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు పొట్ట దగ్గరి కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ టీలు ఏమిటి ? వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించే వివిధ రకాల టీలు..!

1. గ్రీన్‌ టీ

గ్రీన్‌ టీని తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. మార్కెట్‌లో గ్రీన్‌ టీ బ్యాగ్స్‌, పొడి లభిస్తున్నాయి. టీ బ్యాగ్స్‌ అయితే వేడి నీటిలో ఒక బ్యాగ్‌ వేస్తే చాలు, 2 నిమిషాల్లో టీ తయారవుతుంది. అదే పొడి అయితే నీటిలో 5 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత టీ తయారవుతుంది. దాన్ని తాగితే చాలు. అధిక బరువు తగ్గుతారు.

2. అల్లం టీ

రెండు కప్పుల నీళ్లలో ఒక చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. అనంతరం అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, అర టీస్పూన్‌ నిమ్మరసం కలిపి తాగేయాలి.

3. దాల్చిన చెక్క టీ

రెండు కప్పుల నీళ్లలో చిన్న దాల్చిన చెక్క ముక్క లేదా పొడి వేసి మరిగించాలి. అనంతరం ఆ నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగాలి.

4. పసుపు టీ

నీళ్లలో పసుపు వేసి మరిగించి అందులో తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు.

5. బ్లాక్‌ టీ

నీళ్లలో టీ పొడి వేసి బాగా మరిగించి డికాషన్‌ తయారు చేయాలి. అనంతరం వడకట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగేయాలి.

6. పెప్పర్‌మింట్‌ టీ

పెప్పర్‌ మింట్‌ టీ బ్యాగ్స్‌ మనకు లభిస్తాయి. వేడి నీటిలో వాటిని వేస్తే చాలు టీ తయారవుతుంది.

7. ఊలాంగ్‌ టీ

ఈ టీకి చెందిన పొడి, బ్యాగ్స్‌ లభిస్తాయి. వేడి నీటిలో టీ బ్యాగ్‌ ఒకటి వేస్తే టీ తయారవుతుంది. లేదా పొడి అయితే నీళ్లలో మరిగించాలి. అనంతరం అందులో నిమ్మరసం కలిపి తాగేయాలి.

ఈ విధంగా పైన తెలిపిన టీలలో మీకు నచ్చిన టీలను తాగవచ్చు. దీంతో అధిక బరువు తగ్గడమే కాక పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరుగుతుంది.

Admin

Recent Posts